News July 15, 2024

రీఛార్జ్ ధరలు పెంచినా మెరుగుపడని సేవలు!

image

జియో, ఎయిర్‌టెల్, VI ఇటీవల టారిఫ్ ఛార్జీలు భారీగా పెంచినా యూజర్లకు నాణ్యమైన సేవలు అందించడంలో విఫలమవుతున్నాయని ‘లోకల్ సర్కిల్స్’ సంస్థ తెలిపింది. కాల్ డ్రాప్, కనెక్షన్ సమస్యను 89% మంది ఎదుర్కొంటుండగా, 38% మందికి తరచూ ఈ ఇబ్బంది ఎదురవుతోంది. గ్రామీణ ప్రాంతాల్లోనే కాకుండా మెట్రో నగరాల్లోనూ ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అయితే 2022 నాటితో పోలిస్తే ఈ సమస్య స్వల్పంగా తగ్గినట్లు సర్వేలో తేలింది.

Similar News

News December 8, 2025

BOBలో 82 పోస్టులు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

image

బ్యాంక్ ఆఫ్ బరోడా(BOB)లోని రిసీవబుల్ మేనేజ్‌మెంట్ డిపార్ట్‌మెంట్‌లో 82 పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి డిగ్రీ, పీజీ డిప్లొమా, ఎంబీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.850, SC, ST, PwBD, మహిళలకు రూ.175. షార్ట్ లిస్టింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://bankofbaroda.bank.in

News December 8, 2025

అధిక దిగుబడినిచ్చే నువ్వుల రకాలు ఇవే..

image

☛ ఎలమంచిలి 66 (శారద): ఈ రకం పంట కాలం 80-90 రోజులు. దిగుబడి ఎకరాకు 500-600 కిలోలు. లేత గోధుమ రంగు విత్తనం. కోస్తా, రాయలసీమ జిల్లాలకు అనుకూలం. బూడిద, ఆకుమచ్చ తెగుళ్లను తట్టుకుంటుంది.
☛ Y.L.M 146: పంట కాలం 90-95 రోజులు. దిగుబడి ఎకరాకు 600 కిలోలు. నూనె 45%గా ఉంటుంది. వేరు, కాండం కుళ్లు, వెర్రి తెగులు, ఆల్టర్నేరియా, సర్కోస్పర ఆకుమచ్చ తెగుళ్లను కొంత వరకు తట్టుకుంటుంది.

News December 8, 2025

900 మంది పైలట్లను తీసుకోనున్న ఇండిగో!

image

సంక్షోభం నుంచి బయటపడేందుకు భారీగా పైలట్లను నియమించుకోవడంపై ఇండిగో దృష్టిపెట్టింది. ఫిబ్రవరి 10కి 158 మంది, 2026 Dec కల్లా 742 మందిని తీసుకుంటామని ప్రభుత్వానికి సంస్థ చెప్పినట్లు జాతీయ మీడియా పేర్కొంది. ‘ప్రస్తుతం 250 మంది జూనియర్ ఫస్ట్ ఆఫీసర్లకు ట్రైనింగ్ ఇస్తోంది. మరో 300 మంది కెప్టెన్లు, 600 మంది ఫస్ట్ ఆఫీసర్ల నియామకం/అప్‌గ్రేడ్ చేయనుంది’ అని తెలిపింది. కాగా ఇండిగోకు 5,456 మంది పైలట్లు ఉన్నారు.