News March 12, 2025
ప్రపంచమంతా ఏకమైనా టీమ్ ఇండియాను ఓడించలేరు: అఫ్రీది

ప్రస్తుతం టీమ్ ఇండియా అన్ని విభాగాల్లో పటిష్ఠంగా ఉందని, ప్రపంచ క్రికెట్ మొత్తం ఒక జట్టుగా ఏర్పడినా ఆ టీమ్ను ఓడించలేరని పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రీది అన్నారు. ‘భారత జట్టు నిండా మ్యాచ్ విన్నర్లే. జట్టులోని ప్రతి ఒక్కరూ టాప్ ఫామ్లో ఉన్నారు. ప్రస్తుతం టీమ్ ఇండియాను ఓడించడం ఏ జట్టుకైనా పెద్ద సవాలే. ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడానికి వారు పూర్తి అర్హులే. భారత్కు నా శుభాకాంక్షలు’ అని పేర్కొన్నారు.
Similar News
News October 18, 2025
గల్లీలో కాదు.. ఢిల్లీలో పోరాడండి: హరీశ్ రావు

TG: BC రిజర్వేషన్ల పెంపు కోసం కాంగ్రెస్, BJP గల్లీలో కాకుండా ఢిల్లీలో పోరాటం చేయాలని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. ‘కేంద్రంలో BJP, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నాయి. ఈ 2 పార్టీలు మద్దతిచ్చాక రిజర్వేషన్ల పెంపును ఆపేదెవరు? పార్లమెంటులో రాజ్యాంగ సవరణ ద్వారా BC రిజర్వేషన్ల పెంపు సాధించాల్సింది పోయి కాలయాపన చేస్తున్నాయి. ఏ పార్టీ బిల్లు పెట్టినా BRS మద్దతు ఉంటుంది’ అని ట్వీట్ చేశారు.
News October 18, 2025
మరో వివాదంలో యూసుఫ్ పఠాన్

Ex క్రికెటర్, MP యూసుఫ్ పఠాన్ వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. బెంగాల్లోని అదీనా మసీదుపై ఆయన చేసిన ట్వీట్ తాజాగా దుమారం రేపింది. ఇది అద్భుత కట్టడమని, సుల్తాన్ సికందర్ నిర్మించారని పోస్ట్ చేయడంపై BJP నేతలు మండిపడుతున్నారు. అది మసీదు కాదని, ఆదినాథ్ ఆలయాన్ని ధ్వంసం చేసి నిర్మించారని కౌంటర్ ఇస్తున్నారు. ఇటీవల <<17728883>>ప్రభుత్వ స్థలాన్ని<<>> ఆక్రమించారని ఆయనపై GJ హైకోర్టు సీరియస్ అవడం తెలిసిందే.
News October 18, 2025
ఉద్యోగ సంఘాలతో సీఎం భేటీ.. దీపావళి కానుక ప్రకటిస్తారా?

AP: మంత్రివర్గ ఉపసంఘం, ఉద్యోగ సంఘాల నాయకులతో సీఎం చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసంలో భేటీ అయ్యారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం దిశగా సీఎం వారితో చర్చిస్తున్నారు. దీపావళి సందర్భంగా ప్రభుత్వం ఏదైనా కానుక అందిస్తుందని ఉద్యోగులు ఆశిస్తున్నారు. దీనిపై కాసేపట్లో సీఎం ప్రకటన చేసే అవకాశం ఉంది.