News November 8, 2024
ప్రపంచం మారినా బాబు మారడు: విజయసాయిరెడ్డి

AP: ప్రపంచం ఎంతో మారిందని, కానీ సీఎం చంద్రబాబు మారడం లేదని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. పుట్టినప్పటి నుంచి అవే మోసాలు, అబద్ధాలు ఆడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. ‘జ్ఞానం కలగాల్సిన వయసులో కూడా పాపాలు చేస్తున్నాడు. ఆయనకు ఇక నరకం సరిపోదు.. యముడు ఒక ప్రత్యేక లోకాన్ని సృష్టించాల్సిందే. చివరకు ఆ యముడిని కూడా తప్పుదోవ పట్టిస్తారేమో?’ అని ఆయన ట్వీట్ చేశారు.
Similar News
News December 17, 2025
గాజాకు బలగాలు?.. సంకటంలో పాకిస్థాన్!

గాజా స్టెబిలైజేషన్ ఫోర్స్‌కు సైనికులను అందించాలని పాకిస్థాన్‌పై అమెరికా ఒత్తిడి తెస్తోంది. అయితే దీనికి ఒప్పుకోలేక, కాదనలేక పాక్ సంకటంలో ఉంది. సైనికులను పంపిస్తే సొంత దేశంలోనే నిరసనలు ఎదురయ్యే అవకాశం ఉంది. US, ఇజ్రాయెల్‌ను పాక్ ఇస్లామిక్ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. సైనికులను పంపకపోతే ట్రంప్ ఆగ్రహానికి గురికాక తప్పదు. దీంతో ముందు నుయ్యి, వెనుక గొయ్యి అన్నట్లుగా ఉంది పాక్ పరిస్థితి.
News December 17, 2025
ఓటు వేసి వెళ్తూ గుండెపోటుతో మృతి

TG: తుది విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ వేళ ఖమ్మం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సత్తుపల్లి మండలం బేతుపల్లిలో ఓటు వేసి ఇంటికి వెళ్తుండగా నాగులవంచ సత్యనారాయణ(65) గుండెపోటుకు గురయ్యారు. కుటుంబ సభ్యులు వెంటనే సత్తుపల్లి ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా మధ్యాహ్నం ఒంటి గంటకు పోలింగ్ ముగియనుంది.
News December 17, 2025
లేటెస్ట్ మూవీ అప్డేట్స్

*రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న “ది రాజా సాబ్” సినిమా నుంచి ఈరోజు రెండో సాంగ్ విడుదల. సాయంత్రం 5 గంటల నుంచి హైదరాబాద్‌లోని లులు మాల్లో ఈవెంట్ ప్లాన్ చేసిన నిర్మాతలు.
*విజయ్ దేవరకొండ హీరోగా దర్శకుడు రవికిరణ్ తెరకెక్కిస్తోన్న ‘రౌడీ జనార్ధన’ టీజర్ విడుదల 22వ తేదీకి వాయిదా.
*మలయాళ స్టార్ హీరో మోహన్‌లాల్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక మూవీ “వృషభ” ఈ నెల 25న విడుదల కానుంది.


