News June 16, 2024
ప్రపంచం అంతమైనా ఈ 5 జీవులు బతికేస్తాయట!

ఏదైనా ప్రళయమొచ్చి జీవరాశి నామరూపాలు లేకుండా పోయినా ఓ ఐదు జీవులు మాత్రం బతికేస్తాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. టార్టిగ్రేడ్ ఆహారం, ఆక్సిజన్, నీళ్లు లేకుండా బతికేస్తుంది. బొద్దింకలు విష పదార్థాలు, రేడియేషన్‌ను తట్టుకుని జీవిస్తాయి. రాబందులు విపత్తులో మరణించిన జంతువుల మాంసాన్ని తింటూ బతికేయగలవు. షార్క్ చేపలు విపత్తును తట్టుకుని జీవించగలవు. ఎంపరర్ పెంగ్విన్లు కూడా నిక్షేపంగా బతికేస్తాయి.
Similar News
News March 24, 2026
TODAY HEADLINES

☛ కొవిడ్ తరహాలోనే యుద్ధం వల్ల ఏర్పడే సవాల్‌నూ ఎదుర్కొందాం: PM మోదీ
☛ ఏపీలో ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన
☛ 7 బిల్లులకు TG క్యాబినెట్ ఆమోదం
☛ మూసీ ప్రక్షాళన అత్యవసరం.. విపక్షాల ట్రాప్‌లో పడొద్దు: CM రేవంత్
☛ ₹10వేలకు పైగా తగ్గిన బంగారం ధర
☛ ఇరాన్‌తో యుద్ధానికి 5 రోజుల విరామం: ట్రంప్
☛ యుద్ధంలో US-ఇజ్రాయెల్ ఓడాయి: ఇరాన్
News March 24, 2026
తమిళనాడులో హోరాహోరీ తప్పదా?

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో హోరాహోరీ తప్పదని VoteVibe ఒపీనియన్ పోల్ అంచనా వేసింది. CNN-News18 రిలీజ్ చేసిన సర్వే ప్రకారం 234 సీట్లున్న అసెంబ్లీలో DMK, INC, CPI, CPM కలిసి 113-123 సీట్లు గెలిచే అవకాశం ఉంది. AIADMK, BJP కూటమి 106-116 స్థానాల్లో విజయం సాధించే ఛాన్స్ ఉంది. విజయ్ పార్టీ TVK 2-8 సీట్లకే పరిమితమవుతుందని పేర్కొంది. 39%మందిలో ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నట్లు చెప్పింది.
#ELECTIONS2026
News March 24, 2026
రీ-రిలీజ్ ట్రెండ్.. మరోసారి థియేటర్లలోకి స్టార్ల సినిమాలు

టాలీవుడ్‌లో రీ-రిలీజ్ ట్రెండ్ కొనసాగుతోంది. ప్రభాస్, కాజల్ జంటగా నటించిన ‘డార్లింగ్’ APR 23న మరోసారి థియేటర్లలోకి రానుంది. Jr.NTR బర్త్‌డే సందర్భంగా మే 20న ‘ఊసరవెల్లి’, ‘ఆంధ్రావాలా’ స్పెషల్ షోలు వేయనున్నారు. APR 8న అల్లు అర్జున్ బర్త్‌డే సందర్భంగా ‘రేసు గుర్రం’ రీ-రిలీజ్ కానుంది. మహేశ్ బాబు నటించిన ‘అతిథి’ మే 29న, ‘పోకిరి’ AUGలో మరోసారి థియేటర్లలో అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతున్నాయి.


