News September 12, 2025
ఆర్థిక సమస్యలున్నా అందరికీ ప్రయోజనం: అనగాని

AP: రాష్ట్రంలో ఆర్థిక సమస్యలున్నా తమ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి చేకూరుస్తున్నామని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. సీఎం చంద్రబాబు సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారని చెప్పారు. ‘జీఎస్టీ వసూళ్లు, వృద్ధి రేటులో రాష్ట్రం మంచి ప్రగతి సాధించింది. రూ.10 లక్షల కోట్ల ఇన్వెస్ట్‌మెంట్స్ వల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయి’ అని ఆయన పేర్కొన్నారు.
Similar News
News September 12, 2025
నాలెడ్జ్ ఎకానమీగా అమరావతి: చంద్రబాబు

AP: రాబోయే మూడేళ్లలో అమరావతిలో రూ.50వేల కోట్ల పనులు పూర్తవుతాయని సీఎం చంద్రబాబు వే2న్యూస్ కాన్‌క్లేవ్‌లో చెప్పారు. అమరావతిని నాలెడ్జ్ ఎకానమీగా, క్వాంటం సిటీగా తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు. పోలవరం రాష్ట్రానికి ఎంతో కీలకమని, దాన్ని మూడేళ్లలో పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. 740 కి.మీ దూరం కృష్ణమ్మను తరలించి రాయలసీమకు, కుప్పానికి నీరు అందించామని వివరించారు.
News September 12, 2025
2029లో వచ్చేది NDAనే: చంద్రబాబు

AP: దేశంలో, రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లోనూ ఎన్డీయే కూటమే అధికారంలోకి వస్తుందని సీఎం చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. 2029లో నరేంద్రమోదీ నాలుగోసారి పీఎం అవుతారని Way2News కాన్‌క్లేవ్‌లో పేర్కొన్నారు. ఆలస్యంగా సాధించే విజన్ 2020, 2047 వంటి సుదీర్ఘ లక్ష్యాల వల్ల రాజకీయంగా నష్టమేమీ ఉండదని స్పష్టం చేశారు. తమ భవిష్యత్తు విజయాలపై సందేహం అవసరం లేదని, ఇది రాసిపెట్టుకోవాలని అన్నారు.
News September 12, 2025
అభివృద్ధి, సంక్షేమాన్ని సమానంగా చూస్తున్నా: CM

AP: లాంగ్ టర్మ్ విజన్ వల్ల రాజకీయంగా నష్టం ఉంటుంది కదా అనే ప్రశ్నకు సీఎం చంద్రబాబు సమాధానమిచ్చారు. ‘అభివృద్ధి, రాజకీయ ప్రయోజనాలు.. ఇలా రెండింటి కోసం కష్టపడాల్సిన అవసరముంది. అందుకే సూపర్-6 అమలు చేశాం. అభివృద్ధి కోసం మూలధన పెట్టుబడులు పెంచాం. వృద్ధి రేటును 17%కి పెంచేలా కృషి చేస్తున్నా. నేను రాజకీయ ప్రయోజనాల గురించి ఆలోచిస్తే హైదరాబాద్ అభివృద్ధి చెందేది కాదు’ అని Way2News Conclaveలో తెలిపారు.