News May 3, 2024
రేడియో లేకున్నా ‘ఆకాశవాణి’ కథలు వినొచ్చు

ఆకాశవాణి కథలు ఇష్టపడే వారి సంఖ్య చాలా ఎక్కువగానే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే వేసవిలో పిల్లల కోసం ప్రసారభారతి ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతోంది. అయితే.. ఇందుకోసం రేడియో ఉండాల్సిన అవసరం లేదు. ‘న్యూస్ ఆన్ ఎయిర్’ అనే యాప్ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని.. రేడియో ఛానళ్లలో భాషతో పాటు ఆకాశవాణి కేంద్రాన్ని ఎంపిక చేసుకోవాలి. ప్రపంచంలో ఎక్కడున్నా ప్రత్యక్ష ప్రసారాలు వినవచ్చు.
Similar News
News December 3, 2025
ఖమ్మం: అయ్యప్ప భక్తులకు శుభవార్త

శబరిమల వెళ్లే అయ్యప్ప మాలధారులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త అందించింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఖమ్మం మీదుగా ప్రత్యేక రైళ్లను నడపాలని రైల్వే ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఈ నెల (డిసెంబర్) 13, 18, 20, 22, 24, 26 తేదీల్లో ఒక్కో ట్రిప్ చొప్పున ఈ ప్రత్యేక రైళ్లు సేవలు అందించనున్నాయి. పూర్తి వివరాలకు, టికెట్ల రిజర్వేషన్ కోసం స్టేషన్ను సంప్రదించాలని రైల్వే శాఖ సూచించింది.
News December 3, 2025
PCOSతో దంత సమస్యలు

పీసీఓఎస్ సమస్య పెరిగినప్పుడు ‘పెరియోడాన్టైటిస్’ అనే చిగుళ్ల సమస్య కూడా వస్తుందంటున్నారు నిపుణులు. దీన్ని నిర్లక్ష్యం చేస్తే దంతాలు వదులవుతాయంటున్నారు. PCOS వల్ల మహిళల్లో ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్ అసమతుల్యత ఏర్పడుతుంది. దీంతో చిగుళ్లలో రోగనిరోధక శక్తి తగ్గి ఇన్ఫెక్షన్లు వస్తాయి. కాబట్టి వైద్యులను సంప్రదిస్తే తగిన మందులతో పాటు ఆహారపుటలవాట్లలో కూడా మార్పులు-చేర్పులు సూచిస్తారని చెబుతున్నారు.
News December 3, 2025
నేపియర్ కంటే 4G బుల్లెట్ సూపర్ నేపియర్ ఎందుకు ప్రత్యేకం?

నేపియర్ గడ్డి ముదిరితే కాండం కాస్త గట్టిగా ఉంటుంది. 4G బుల్లెట్ సూపర్ నేపియర్ కాండం ముదిరినా లోపల డొల్లగా ఉండి, పాడి పశువు తినడానికి సులువుగా ఉంటుంది. నేపియర్తో పోలిస్తే దీనిలో తీపిదనం కాస్త ఎక్కువగా ఉంటుంది. ఈ గడ్డి చాలా గుబురుగా పెరుగుతుంది. 4G బుల్లెట్ సూపర్ నేపియర్లో ప్రొటీన్ కంటెంట్, దిగుబడి, మొక్కలు పెరిగే ఎత్తు, మొక్క ఆకుల్లోని మృదుత్వం.. సాధారణ నేపియర్ గడ్డి కంటే ఎక్కువగా ఉంటుంది.


