News October 30, 2024
వాళ్లిద్దరూ వ్యతిరేకించినా గెలుపు నాదే: నవాబ్

BJP, శివసేన వ్యతిరేకించినా మన్‌ఖుర్ద్ శివాజీనగర్ స్థానంలో గెలుపు తనదే అని NCP అభ్యర్థి నవాబ్ మాలిక్ అన్నారు. ఈ స్థానం నుంచి సురేశ్ పాటిల్‌ను శివసేన బరిలో దింపడాన్ని ఆయన తప్పుబట్టారు. ‘BJP కూడా పాటిల్‌కు మద్దతు తెలుపుతోంది. నా కుమార్తె బరిలో దిగుతున్న అనుశక్తి నగర్లో కూడా పరిస్థితి ఇలాగే ఉంది. అయినా మాకు నష్టం లేదు. నేను, నా కుమార్తె సనా భారీ మెజారీటీతో గెలుస్తాం’ అన్నారు.
Similar News
News December 1, 2025
ఆలోచనలను ఆదాయ వనరుగా మార్చారు

2014లో నాలుగు ఆవుల్ని కొన్న శ్రీకాంత్, చార్మి దంపతులు అహ్మదాబాద్‌లో వాటిని పెంచుతూ తొలుత పాలు, నెయ్యి, పనీర్ అమ్మారు. ఈ వృత్తినే ఒక ఆదాయ వనరుగా మలచుకోవాలనుకున్నారు. ఆవుల సంఖ్య పెంచి ‘గౌనీతి ఆర్గానిక్’ పేరుతో వ్యాపారం ప్రారంభించారు. పాలు, నెయ్యి, పన్నీరుతో న్యూట్రి బార్లు, లిప్ బామ్ వంటి ఆర్గానిక్ ఉత్పత్తులను, ఆవు పేడతో తయారు చేసిన ధూపం, అగర్ బత్తి వంటి వాటిని తమ ఇంటి వద్దనే అమ్మడం ప్రారంభించారు.
News December 1, 2025
TCILలో 150 పోస్టులు.. అప్లై చేశారా?

టెలి కమ్యూనికేషన్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (TCIL)లో 150 కాంట్రాక్ట్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. పోస్టును బట్టి టెన్త్, డిప్లొమా, ITI, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు DEC 9 వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫామ్, డాక్యుమెంట్స్‌ను tcilksa@tcil.net.in, tcilksahr@gmail.comకు ఇ మెయిల్ ద్వారా పంపాలి. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: www.tcil.net.in/