News March 15, 2025
విమానంలో వచ్చినా చెట్లను నరికేవారు: చంద్రబాబు

AP: గత పాలకులు రాష్ట్రాన్ని పూర్తిగా ధ్వంసం చేసి వెళ్లారని CM చంద్రబాబు మండిపడ్డారు. తమ ప్రభుత్వం సుపరిపాలనతో దూసుకెళ్తోందని చెప్పారు. తణుకులో జరిగిన ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘గత సీఎం జగన్ ఎప్పుడూ ప్రజల్లో తిరగలేదు. ఒక వేళ వచ్చినా పరదాలు కట్టుకుని తిరిగేవారు. విమానంలో వచ్చినా కింద చెట్లను కొట్టేసేవారు. ప్రజా సమస్యలపై ఎప్పుడూ మాట్లాడనిచ్చేవారు కాదు’ అని పేర్కొన్నారు.
Similar News
News March 16, 2025
మధ్యాహ్నం వీటిని తింటున్నారా?

మధ్యాహ్న భోజనంలో కచ్చితంగా సలాడ్లు ఉండేలా చూసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇందులో విటమిన్లు, మినరల్స్, ఫైబర్, ప్రొటీన్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తాయి. అలాగే తెల్ల అన్నంకు బదులు క్వినోవా, బ్రౌన్ రైస్ లాంటి తృణధాన్యాలు ఉండేలా చూసుకోవాలి. బాగా వేయించిన కర్రీలు, పిండి పదార్థాలు ఎక్కువగా ఉండే బంగాళాదుంప, ప్రాసెస్డ్ ఫుడ్, మసాలా పదార్థాల జోలికి వెళ్లొద్దు.
News March 16, 2025
ఏఆర్ రెహమాన్ హెల్త్ అప్‌డేట్

మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ఇప్పుడు బాగానే ఉన్నారని ఆయన తనయుడు అమీన్ తెలిపారు. ‘డీహైడ్రేషన్ కారణంగా నాన్నగారు కొంచెం బలహీనంగా అనిపించారు. అందుకే ఆస్పత్రిలో రొటీన్ టెస్టులు చేయించాం. మీ ప్రేమ, ఆశీర్వాదాలకు కృతజ్ఞతలు’ అని పేర్కొన్నారు. తాను వైద్యులతో మాట్లాడానని, రెహమాన్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు చెప్పారని TN సీఎం స్టాలిన్ వెల్లడించారు. రెహమాన్‌ను వైద్యులు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు.
News March 16, 2025
సీఎం రేవంత్ క్లాస్.. అసెంబ్లీలో ఎమ్మెల్యేలకు అటెండెన్స్?

TG: నిన్న అసెంబ్లీలో CM రేవంత్ ప్రసంగం సమయంలో లంచ్ టైమ్ దాటిపోతున్నా కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో ఒక్కరు కూడా కదల్లేదు. రోజుకు 3సార్లు MLAల హాజరు తీసుకోవాలని ఆయన చేసిన ఆదేశాలే దీనికి కారణమని తెలుస్తోంది. 3రోజుల క్రితం CLP మీటింగ్‌లో CM మాట్లాడుతున్న సమయంలో ఓ MLA నిర్లక్ష్యంగా బయటికి వెళ్లడం, సభలో BRS నేతలకు తమ సభ్యులు సరైన కౌంటర్ ఇవ్వడం లేదనే రేవంత్ హాజరు నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది.