News April 27, 2024

తిలక్ పోరాడినా.. ముంబైకి తప్పని ఓటమి

image

ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో 258 రన్స్ భారీ లక్ష్యంతో ఛేదనకు దిగిన ముంబై ఇండియన్స్‌కు ఓటమి ఎదురైంది. బ్యాటర్లు పెద్ద స్కోర్లు చేయలేదు. దీంతో 20ఓవర్లలో 247 రన్స్‌కే పరిమితమైంది. తిలక్‌వర్మ(63) పోరాడినా ప్రయోజనం లేకపోయింది. కెప్టెన్ హార్దిక్(46), టిమ్ డేవిడ్(37), సూర్యకుమార్(26), ఇషాన్(20) ఫరవాలేదనిపించారు. ఢిల్లీ బౌలర్లలో ముకేశ్ 3, ఖలీల్ 2, రసిక్ 3 వికెట్లు తీశారు. ఇది MIకి 6వ ఓటమి.

Similar News

News January 10, 2026

భక్తి, ఎదురుచూపులకి నిదర్శనం ‘శబరి’

image

శబరి శ్రీరాముని దర్శనం కోసం ఏళ్ల తరబడి వేచి చూసింది. వృద్ధాప్యం పైబడ్డా, కంటిచూపు మందగించినా ఆమెలో రామనామ స్మరణ తగ్గలేదు. రాముడు వస్తాడన్న ఆశతో రోజూ ఆశ్రమాన్ని శుభ్రం చేస్తూ, మధుర ఫలాలను సేకరించేది. చివరకు రాముడు రానే వచ్చాడు. ఆమె ఎంతో ప్రేమిస్తూ, రుచి చూసి ఇచ్చిన ఎంగిలి పండ్లను రాముడు తృప్తిగా స్వీకరించాడు. శబరి నిష్కల్మష భక్తికి మెచ్చిన రాముడు, ఆమెకు మోక్షాన్ని ప్రసాదించి పునీతురాలిని చేశాడు.

News January 10, 2026

చిరు మూవీ టికెట్ ధరలు పెంపు.. HCలో పిటిషన్

image

TG: మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకర‌వరప్రసాద్‌ గారు’ టికెట్ ధరల పెంపును వ్యతిరేకిస్తూ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్(అత్యవసర విచారణ) దాఖలైంది. దీనిపై సెలవుల తర్వాత విచారిస్తామని కోర్టు పేర్కొంది. ప్రీమియర్ షోల ప్రదర్శనకు అనుమతిస్తూ, రెగ్యులర్ షోల టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఇటీవల <<18809035>>రాజాసాబ్<<>> టికెట్ల పెంపుపై HC ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటికే MSVP బుకింగ్స్ మొదలయ్యాయి.

News January 10, 2026

నీటి విషయంలో రాజీపడేది లేదు: CBN

image

AP: నీటి విషయంలో గొడవలకు దిగితే నష్టపోయేది తెలుగు ప్రజలేనని సీఎం చంద్రబాబు అన్నారు. ‘నీటి సద్వినియోగం వల్లే రాయలసీమలో హార్టికల్చర్ అభివృద్ధి చెందింది. 2020లో నిలిపివేసిన రాయలసీమ లిఫ్ట్‌తో స్వార్థ రాజకీయాలు చేస్తున్నారు. మట్టి పనులు చేసి రూ.900 కోట్లు బిల్లులు చేసుకున్నారు. రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యం.. నీటి విషయంలో రాజీ లేదు’ అని టీడీపీ కార్యాలయంలో మీడియాతో చిట్‌చాట్‌లో స్పష్టం చేశారు.