News October 17, 2025

విడిపోయినా కలవొచ్చు..

image

హిందూ వివాహ చట్టం-1955, సెక్షన్‌-9 ద్వారా విడిపోయిన భార్యాభర్తలు తిరిగి వివాహ బంధాన్ని పునరుద్ధరింపజేయమని కోరవచ్చు. సెక్షన్‌-10 ప్రకారం బంధం చెడకుండా విడివిడిగా ఉండటానికి న్యాయస్థానం ద్వారా అనుమతి కోరవచ్చు. న్యాయసేవల అధికారిక చట్టం ద్వారా స్త్రీలు, పిల్లలు ఉచిత న్యాయసేవలను పొందొచ్చు. ఎవరైనా మహిళను విచారణ జరిపేటప్పుడు ఆమె నివాసంలో, కుటుంబ సభ్యుల సమక్షంలో జరపాలి.

Similar News

News October 17, 2025

భారీగా పెరిగిన బంగారం, తగ్గిన వెండి ధరలు!

image

ధన త్రయోదశికి ముందు బంగారం ధరలు భారీగా పెరిగి కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి. ఇవాళ HYD బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.3,330 పెరిగి ₹1,32,770కు చేరింది. ఏడు రోజుల్లో రూ.9,060 పెరగడం గమనార్హం. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ. 3,050 ఎగబాకి ₹1,21,700గా ఉంది. అటు వెండి ధర మాత్రం రూ.3,000 తగ్గింది. కేజీ సిల్వర్ రేటు రూ.2,03,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News October 17, 2025

భారత్‌తో సిరీస్.. ఆసీస్ కీలక ప్లేయర్ ఔట్

image

భారత్‌తో వన్డే సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియాకు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ కండరాల నొప్పితో సిరీస్‌కు దూరమయ్యారు. అతని స్థానంలో మార్నస్ లబుషేన్‌‌ను ఎంపిక చేశారు. ఈ నెల 19న తొలి వన్డే పెర్త్‌లో, 23న రెండోది అడిలైడ్, మూడో వన్డే 25న సిడ్నీలో జరగనుంది. మొదటి మ్యాచ్ పెర్త్‌‌లో జరగనుండగా, అక్కడి బౌన్సీ పిచ్ మన బ్యాటర్లకు సవాలు విసరనుందని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు.

News October 17, 2025

అన్నింటా రాణిస్తున్న అతివలు

image

ప్రస్తుతం అన్ని రంగాల్లోనూ ఆడవాళ్లు తమ ముద్ర వేస్తున్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో తామూ ముందుంటామంటున్నారు. తాజాగా హైదరాబాద్​లోని జాతీయ పోలీస్​ అకాడమీలో 77వ రెగ్యులర్​ రిక్రూట్​ బ్యాచ్​లో 174 మంది ఈసారి ప్రాథమిక శిక్షణ పూర్తి చేసుకున్నారు. వారిలో 62 మంది అమ్మాయిలే. ఇండియన్​ పోలీస్​ సర్వీస్​ చరిత్రలో ఇది ఒక రికార్డుగా చెప్పవచ్చు. 73వ బ్యాచ్‌లో 20.66% ఉన్న ఈ సంఖ్య, ఈసారి 35% పైగా పెరగడం గమనార్హం.