News December 22, 2024
లేట్‌గా వచ్చినా లేటెస్ట్గా వస్తాం: మంత్రి
AP: రాష్ట్రంలో ఉచిత బస్సు పథకాన్ని ఎవరూ వేలెత్తి చూపించకుండా అమలు చేస్తామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఒకటో తేదీన ప్రారంభించి 16న మూసేయడం తమకు ఇష్టం లేదన్నారు. కాస్త లేట్‌గా వచ్చినా లేటెస్ట్గా వస్తామని డైలాగ్ వేశారు. పథకం అమలయ్యేనాటికి సమస్యలను అధిగమించేలా చర్యలు చేపట్టామని చెప్పారు. త్వరలో 1400 బస్సులను అందుబాటులోకి తెస్తామని, ఆ తర్వాత మరో 2000 ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేస్తామన్నారు.
Similar News
News December 22, 2024
భారత్‌తో T20 సిరీస్‌కు ఇంగ్లండ్ జట్టు ఎంపిక
భారత్‌తో T20 సిరీస్, ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం ఇంగ్లండ్ తమ జట్టును ప్రకటించింది. 15 మందితో కూడిన జట్టుకు జోస్ బట్లర్ సారథిగా వ్యవహరిస్తారు. T20 సిరీస్ జట్టు: బట్లర్(C), మార్క్ వుడ్, రెహాన్ అహ్మద్, ఆర్చర్, అట్కిన్సన్, బెతెల్, బ్రూక్, కార్స్, డకెట్, ఓవర్టన్, జేమీ స్మిత్, లివింగ్‌స్టోన్, ఆదిల్ రషీద్, మహమూద్, ఫిల్ సాల్ట్. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం రెహాన్ అహ్మద్ స్థానంలో జో రూట్‌ను ఎంపిక చేసింది.
News December 22, 2024
భారత్ భారీ స్కోరు
వెస్టిండీస్‌పై T20 సిరీస్ గెలిచి ఊపు మీదున్న భారత మహిళల జట్టు తొలి వన్డేలో అదే జోరును కొనసాగిస్తోంది. ముందుగా బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 314 రన్స్ చేసింది. ఫామ్‌లో ఉన్న స్మృతి మంధాన 91 పరుగుల వద్ద ఔటై సెంచరీ చేజార్చుకున్నారు. హర్లీన్(44), ప్రతీక(40), హర్మన్ ప్రీత్(34) ఫర్వాలేదనిపించారు. విండీస్ బౌలర్లలో జేమ్స్ 5, మాథ్యూస్ 2 వికెట్లు తీశారు. WI టార్గెట్ 315.
News December 22, 2024
ఆ అవకతవకల్లో నా ప్రమేయం లేదు: మాజీ క్రికెటర్
తనపై <<14941111>>నమోదైన కేసుపై<<>> మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప స్పందించారు. తాను పెట్టుబడి పెట్టాననే కారణంతోనే సెంటారస్ లైఫ్ స్టైల్ బ్రాండ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో డైరెక్టర్ పదవి తనకు ఇచ్చారని చెప్పారు. అయితే తానెప్పుడూ ఆ సంస్థలో యాక్టివ్‌గా లేనని తెలిపారు. కొన్నేళ్ల క్రితమే ఈ పదవికి రాజీనామా చేసినట్లు పేర్కొన్నారు. ఉద్యోగులకు పీఎఫ్ నిధుల అవకతవకల్లో తన ప్రమేయం లేదని స్పష్టం చేశారు.