News October 4, 2025
సకల సంపదలు ఉన్నా.. భక్తి లేకపోతే శూన్యమే!

భగవద్భక్తి హీనస్య జాత్యాశ్శాస్త్రంజపస్తప:॥
అప్రాణస్యైవ దేహస్య మండనంలోకరంజనమ్॥
అని ‘భక్తి వేదం’ తెలుపుతోంది. అంటే.. దేవునిపై భక్తి లేకపోతే, మనిషి ఎన్ని గొప్ప పనులు చేసినా అది వ్యర్థమే. ఎంత ధనం ఉన్నా, విద్యావంతులైనా, గొప్ప వంశంలో పుట్టినా.. దైవభక్తి లేకపోతే అవన్నీ ప్రాణం లేని దేహానికి అలంకరణ చేసినంత వ్యర్థం అనేది ఈ శ్లోక తాత్పర్యం. దేనిలోనైనా భగవద్భక్తి ఉండడమే ముఖ్యమని ఈ శ్లోకం చెబుతోంది. <<-se>>#daivam<<>>
Similar News
News October 4, 2025
ట్రంప్ నాయకత్వాన్ని స్వాగతించిన మోదీ

ఇజ్రాయెలీ బందీలందరినీ <<17908342>>విడుదల<<>> చేసేందుకు హమాస్ అంగీకరించడంపై ప్రధాని మోదీ స్పందించారు. ‘ట్రంప్ లీడర్‌షిప్‌ను స్వాగతిస్తున్నాం. గాజాలో శాంతి నెలకొల్పేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాలు పురోగతి సాధించడం శుభ పరిణామం. బందీల విడుదలకు ఒప్పుకోవడం కీలక ముందడుగు. శాంతి దిశగా జరిగే అన్ని ప్రయత్నాలకు భారత మద్దతు కొనసాగుతుంది’ అని ట్వీట్ చేశారు.
News October 4, 2025
సూర్యుణ్ని ఏయే సమయాల్లో చూడరాదు?

ప్రభాత వేళ, సూర్యాస్తమయ వేళ, మిట్ట మధ్యాహ్నం సమయంలో రవిని సూటిగా చూడకూడదని పండితులు, జ్యోతిషులు చెబుతున్నారు. ఈ సమయాల్లో సూర్య కిరణాలు అత్యంత ప్రభావవంతంగా ఉండి మన శరీర నిర్మాణానికి హాని కలిగిస్తాయని అంటున్నారు. అలాగే గ్రహణాల సమయంలోనూ చూడొద్దని సూచిస్తున్నారు. ‘సూర్యశక్తిలో వచ్చే మార్పుల వల్ల నేత్రాలకు హాని కలుగుతుంది’ అని చెబుతున్నారు.
<<-se>>#DharmaSandehalu<<>>
News October 4, 2025
పంచ భూతాలను శుద్ధి చేసే మంత్రం

‘ఓం నమ:శివాయ’ మంత్రాన్ని జపిస్తే.. మన శరీరాన్ని నిర్మించిన పంచ భూతాలు శుద్ధి అవుతాయి. మనలోని ప్రతి అణువు పవిత్రతను సంతరించుకుంటుంది. శరీరాన్ని, ఆలోచనలను పరిశుభ్రం చేస్తుంది. ‘ఓం నమ:శివాయ’ అని పదేపదే స్మరించినప్పుడు మనలోని ప్రతి నాడీ ప్రభావితమవుతుంది. ఫలితంగా గందరగోళం, అలజడి దూరమవుతాయి. ప్రశాంతత దగ్గరవుతుంది. మనలోని తమోగుణం, రజోగుణాలు దూరమై సాత్విక భావం పెరుగుతుంది. <<-se>>#ShivaNaamaalu<<>>