News September 9, 2024
ఐఐటీల్లో చదివినా.. జీతాలు అంతంత మాత్రమే

అత్యుత్తమ చదువులకు ఆలయాలుగా భావించే IITల్లో చదివినా చాలామందికి తక్కువ వేతనాలే లభిస్తున్నాయి. పలు IITల్లో కనిష్ఠ వేతనం రూ.6లక్షల నుంచి రూ.7లక్షలలోపే ఉంటోంది. టాప్ సంస్థల్లోనూ ఇదే పరిస్థితి. ప్రపంచ ఆర్థిక పరిస్థితులు విద్యార్థుల ప్యాకేజీపై ప్రభావం చూపుతున్నాయి. గతేడాది IIT బాంబేలో 22 మందికి రూ.కోటి ప్యాకేజీ లభించగా, అతి తక్కువ ప్యాకేజీ ₹4-6లక్షలుగా నమోదైంది. ఖరగ్పూర్, రూర్కీల్లో ₹8లక్షల వరకూ ఉంది.
Similar News
News December 7, 2025
రోహిత్ శర్మ మరో 984 పరుగులు చేస్తే..

ఇంటర్నేషనల్ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్లలో రోహిత్ శర్మ(20,048) 13వ స్థానంలో ఉన్నారు. Top10లో నిలవాలంటే ఇంకా 984 రన్స్ చేయాలి. ప్రస్తుతం పదో స్థానంలో జయసూర్య(21,032) కొనసాగుతున్నారు. 11, 12 స్థానాల్లో ఉన్న చందర్పాల్, ఇంజమామ్ రిటైరయ్యారు. ఈ నేపథ్యంలో టాప్ 10లోకి ఎంటరయ్యే ఛాన్స్ రోహిత్కు ఉంది. 2027 ODI WC వరకు ఆడితే ఇది సాధ్యమేనని క్రికెట్ విశ్లేషకుల అంచనా.
News December 7, 2025
NDMAలో పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (<
News December 7, 2025
అత్యాచార బాధితుల కోసం ఓ యాప్

ప్రస్తుతకాలంలో చిన్నారులపై అకృత్యాలు పెరిగిపోతున్నాయి. వీటితో పిల్లలకు ఎంతో మనోవ్యధ కలుగుతోంది. దీన్ని తగ్గించడానికి కేంద్రం POCSO e-box యాప్ అందుబాటులోకి తెచ్చింది. ఇందులో ఫిర్యాదు చేస్తే బాధితుల వివరాలు గోప్యంగా ఉంచడంతో పాటు నేరస్తులకు శిక్ష పడే వరకు ఈ యాప్ సేవలు అందిస్తుంది. ఈ యాప్ను జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. కేసు అప్డేట్స్ కూడా ఇందులో తెలుసుకొనే వీలుంటుంది.


