News March 23, 2024
34 ఏళ్లకు పిల్లలను కనాలనుకున్నా.. కుదర్లేదు: వరలక్ష్మీ శరత్ కుమార్

తన సినీ, వ్యక్తిగత జీవితం గురించి వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక విషయాలు తెలిపారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘నా తొలి చిత్రం పోడాపోడీ షూటింగ్ సమయానికి నా ఏజ్ 22ఏళ్లు. 28ఏళ్లలోపు స్టార్‌గా ఎదిగి, 32ఏళ్లకు పెళ్లి చేసుకుని, 34ఏళ్లకు పిల్లల్ని కనాలనుకున్నా. ఇప్పుడు నా వయసు 38 ఏళ్లు. నేను వేసుకున్న ప్రణాళికలేవీ వర్కవుట్ కాలేదు’ అని చెప్పారు. ఇటీవల సచ్దేవ్తో ఆమె ఎంగేజ్మెంట్ జరిగిన విషయం తెలిసిందే.
Similar News
News September 14, 2025
ALERT: రోడ్డుపై చెత్త వేస్తే 8 రోజుల జైలు శిక్ష

TG: హైదరాబాద్‌లో రోడ్లపై చెత్త వేసే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు వెస్ట్ జోన్ DCP విజయ్‌కుమార్ స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. చెత్త వేసే వారిని చట్టప్రకారం నేరస్థులుగా పరిగణిస్తూ 8 రోజుల వరకు శిక్ష విధిస్తున్నారు. ఈ క్రమంలో బోరబండ PS పరిధిలో రోడ్లపై చెత్త వేసిన ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి మీద ఛార్జిషీటు దాఖలు చేసి జడ్జి ముందు హాజరుపరచగా 8 రోజుల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు.
News September 14, 2025
ముప్పైల్లోనే ముడతలా..?

ప్రస్తుతం చాలామందిలో ప్రీమెచ్యూర్ ఏజింగ్ కనిపిస్తోంది. ఫోన్లు, ల్యాప్‌టాప్ నుంచి వచ్చే బ్లూ లైట్ కారణంగా చిన్నవయసులోనే వృద్ధాప్యఛాయలు కన్పిస్తున్నాయని పలు పరిశోధనల్లో వెల్లడైంది. బ్లూ లైట్‌కు ఎక్కువగా ప్రభావితం కావడం వల్ల చర్మం సాగే గుణం కోల్పోతుంది. దీంతో ముడతలు వస్తాయి. ఇలా కాకుండా ఉండాలంటే గ్యాడ్జెట్లను తక్కువగా వాడటంతోపాటు బ్లూ లైట్ ఎఫెక్ట్‌ను తగ్గించే హైలురోనిక్ యాసిడ్ ఉన్న క్రీములను వాడాలి.
News September 14, 2025
SLBC కూలి 200 రోజులైనా స్పందించని కేంద్రం: కేటీఆర్

TG: SLBC టన్నెల్ కూలి 200 రోజులైనా కేంద్రం స్పందించడం లేదని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఇప్పటికీ బాధితులకు ఎలాంటి పరిహారం అందించలేదని ఎక్స్‌లో ఆరోపించారు. ‘కాళేశ్వరంలో చిన్నపాటి లోపాలకే హంగామా చేసిన కేంద్ర ప్రభుత్వం SLBC ఘటనపై ఒక్క బృందాన్ని కూడా పంపలేదు. చోటా భాయ్‌ను బడే భాయ్ కాపాడుతున్నారు. మేము ఈసారి అధికారంలోకి వస్తే బాధితులకు న్యాయం చేస్తాం’ అని ఆయన పేర్కొన్నారు.