News May 14, 2024
లిప్‌స్టిక్ వేసుకున్నా ఆ దేశంలో కఠిన శిక్షలు!

ఉత్తర కొరియాలో నిబంధనల గురించి తెలిస్తే ఆశ్చర్యం కలగకమానదు. ఉదాహరణకు ఆ దేశంలో లిప్‌స్టిక్ వేసుకున్నా ప్రమాదమే. ఎటువంటి దుస్తులు ధరించాలో, ఎలాంటి హెయిర్ కట్ చేయించాలో కూడా ప్రభుత్వమే చెబుతుంది. ఉల్లంఘించిన వారికి ఉరిశిక్షల నుంచి జరిమానా వరకు పలు శిక్షలు అమలవుతుంటాయి. ప్రజల్లో స్వతంత్ర భావాలు వస్తే తిరుగుబాటు మొదలవుతుందన్న భయంతోనే దేశ నియంత కిమ్ జాంగ్ ఈ రూల్స్ పెట్టారంటారు పరిశీలకులు.
Similar News
News April 5, 2026
SRH బ్యాటింగ్.. జట్టులో మార్పు

SRHతో మ్యాచులో LSG టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. సలీల్ స్థానంలో లివింగ్‌స్టోన్, పైన్ స్థానంలో హర్షల్ పటేల్ జట్టులోకి వచ్చారు.
SRH: అభిషేక్, హెడ్, కిషన్ (C), క్లాసెన్, అనికేత్, నితీశ్, లివింగ్‌స్టోన్, హర్షల్ పటేల్, హర్ష్ దూబే, ఉనద్కత్, శివాంగ్ కుమార్.
LSG: మార్ష్, పంత్ (C), మార్క్రమ్, పూరన్, సమద్, ముకుల్ చౌదరి, సిద్దార్థ్, అవేశ్ ఖాన్, షమీ, దిగ్వేశ్, ప్రిన్స్.
News April 5, 2026
షిన్రిన్-యోకు: స్ట్రెస్‌ను దూరం చేసే జపనీస్ టెక్నిక్

నేటి ఉరుకుల పరుగుల జీవితంలో కామన్ అయిపోయిన స్ట్రెస్‌ను దూరం చేసుకునేందుకు జపాన్ వాసులు ‘షిన్రిన్-యోకు’ అనే సహజ ప్రక్రియను అనుసరిస్తున్నారు. షిన్రిన్-యోకు అంటే ప్రకృతి ఒడిలో నిమగ్నమవ్వడం. పచ్చని చెట్లు, పక్షుల కిలకిలారావాలు, మట్టి వాసనలను ఆస్వాదిస్తూ గడపడమే ఈ పద్ధతిలోని కీలకాంశం. ఇలా ప్రకృతితో మమేకమైతే మానసిక ఆందోళనలు దూరమై శారీరకంగా, మానసికంగా ప్రశాంతత లభిస్తుందని జపాన్ వాసుల విశ్వాసం.
News April 5, 2026
దేశంలో ఎక్కువ దూరం ప్రయాణించే రైళ్లు

*వివేక్ ఎక్స్‌ప్రెస్: దిబ్రూగఢ్ (అస్సాం) నుంచి కన్యాకుమారి. 4,154 కి.మీ 75 గంటల్లో ప్రయాణిస్తుంది
*అరోనై ఎక్స్‌ప్రెస్: సిల్చార్ (అస్సాం) నుంచి తిరువనంతపురం. 3,916 కి.మీ.
*హిమ్‌సాగర్ ఎక్స్‌ప్రెస్: కన్యాకుమారి నుంచి కత్రా(J&K). 3,789 కి.మీ.
*తిరునెల్వేలి జమ్మూ ఎక్స్‌ప్రెస్: తిరునెల్వేలి (TN) నుంచి కత్రా. 3,642 కి.మీ.
*న్యూ టిన్సుకియా: న్యూ టిన్సుకియా (అస్సాం) నుంచి బెంగళూరు. 3,642 కి.మీ.


