News October 4, 2024

మరింత పెరిగిన జుకర్‌బర్గ్ సంపాదన

image

మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ మరింత సంపన్నులయ్యారు. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్‌($205 బిలియన్లు)ను అధిగమించి ప్రపంచంలో రెండో అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచారు. జుకర్‌బర్గ్ నికర విలువ $206.2 బిలియన్లకు పెరిగింది. కాగా, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ $256.2 బిలియన్లతో ప్రపంచ కుబేరుడి స్థానాన్ని నిలుపుకున్నారు. ఫ్రెంచ్ బిజినెస్‌మెన్ బెర్నార్డ్ అర్నాల్ట్ $193 బిలియన్లతో నాలుగో స్థానంలో ఉన్నారు.

Similar News

News October 4, 2024

ఇండియాలో మరో నాలుగు యాపిల్ రిటైల్ స్టోర్స్

image

ఇండియాలో మరో 4 రిటైల్ స్టోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు యాపిల్ ప్రకటించింది. ఇప్పటివరకూ ముంబై, ఢిల్లీలోనే యాపిల్‌కు చెందిన రిటైల్ స్టోర్స్ ఉన్నాయి. వచ్చే ఏడాది బెంగళూరు, పుణే, ఢిల్లీ-ఎన్‌సీఆర్, ముంబైలో మరో నాలుగు స్టోర్స్ ఓపెన్ చేయనున్నట్లు పేర్కొంది. ఐఫోన్ 16 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను భారత్‌లో తయారు చేస్తున్నట్లు వెల్లడించింది. మేడ్-ఇన్-ఇండియా iPhone 16 Pro, Pro Maxల సరఫరా ఈనెల నుంచి ప్రారంభంకానుంది.

News October 4, 2024

తండ్రి ప్రేమ.. ప్రాణాలకు తెగించి కూతురి కోసం..!

image

తండ్రీకూతుళ్ల మధ్య ఉండే ప్రత్యేక బంధం గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. కూతురి సంతోషం కోసం తండ్రి ఎంతైనా కష్టపడుతుంటాడు. అలాంటి ఓ తండ్రి తన కూతురి పెళ్లి కోసం ఏకంగా 50kms నడిచారు. హెలెన్ హరికేన్ USలో విధ్వంసం సృష్టించింది. వరదలు ముంచెత్తి రాకపోకలు నిలిచిపోయాయి. అలాంటి ప్రమాదకర పరిస్థితుల్లోనూ తండ్రి జోన్స్ సౌత్ కరోలినా నుంచి కూతురు ఎలిజబెత్ పెళ్లి జరిగే జాన్సన్ సిటీకి 12 గంటల్లో చేరుకున్నారు.

News October 4, 2024

తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

image

TG: హైడ్రా కూల్చివేతలను వెంటనే నిలిపివేయాలంటూ KA పాల్ వేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారించింది. కూల్చివేతలను ఇప్పటికిప్పుడు నిలిపివేయలేమంది. పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వం, హైడ్రాకు నోటీసులు ఇచ్చింది. పిటిషన్‌లో G.O.99పై స్టే విధించాలని, కూల్చివేతలకు 30రోజుల ముందే నోటీసులు ఇవ్వాలని, హైడ్రాకు చట్టబద్ధత కల్పించాకే కూల్చివేతలు చేపట్టాలని పాల్ కోరారు. తదుపరి విచారణ ఈనెల 14న జరగనుంది.