News August 20, 2024

పార్టీ నేతలు కూడా అలా మాట్లాడలేరు: స్టాలిన్

image

మాజీ సీఎం క‌రుణానిధి గురించి కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పొగిడిన‌ట్టు డీఎంకే నేత‌లు కూడా మాట్లాడలేరని CM స్టాలిన్ అన్నారు. క‌రుణానిధి శత జయంతి స్మారక నాణాన్ని రాజ్‌నాథ్ విడుదల చేశారు. కేంద్రంలో స‌మాన అధికార భాగస్వామ్యం, రాష్ట్ర హ‌క్కుల‌పై దృఢంగా నిల‌బ‌డి సమైఖ్య స్ఫూర్తి బలోపేతానికి కృషి చేసిన వ్య‌క్తి క‌రుణానిధి అని కొనియాడారు. దీంతో రాజ్‌నాథ్ వ్యాఖ్య‌ల‌ను స్టాలిన్ ప్ర‌శంసించారు.

Similar News

News December 26, 2025

‘బాక్సింగ్ డే’ పేరెలా వచ్చిందంటే?

image

19వ శతాబ్దంలో బ్రిటన్‌లో పని మనుషులు క్రిస్మస్ రోజున కూడా పని చేసేవారు. దీంతో యజమానులు వారికి డిసెంబర్ 26న సెలవు ఇచ్చేవారు. క్రిస్మస్ వేడుకల్లో మిగిలిన పిండివంటలు, బహుమతులు, బట్టలు వంటివి చిన్న చిన్న బాక్సుల్లో పెట్టి అందించేవారు. అలా బాక్సుల్లో పెట్టి ఇవ్వడంతో బాక్సింగ్ డే అనే పేరు వచ్చింది. అలాగే చర్చిల ఎదుట బాక్సులు పెట్టి విరాళాలు సేకరించి డిసెంబర్ 26న పేదలకు పంచేవారు.

News December 26, 2025

కొత్త ఏడాదిలో ఇవి మారుతాయి!

image

కొత్త ఏడాదిలో పలు మార్పులు చోటుచేసుకోనున్నాయి.
*8వ వేతన సంఘం అమలుపై స్పష్టత రానుంది. ఉద్యోగుల జీతాలు పెరిగే ఛాన్స్.
*పలు బ్యాంకుల వడ్డీ రేట్ల తగ్గింపు, సవరించిన FD రేట్లు జనవరి నుంచి అమల్లోకి.
*బ్యాంకింగ్ సర్వీసులకు పాన్-ఆధార్ లింక్ తప్పనిసరి.
*PM కిసాన్ సాయం పొందేందుకు యూనిక్ ID కార్డ్ విధానం దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చే అవకాశం.
*LPG, వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరల్లో మార్పులు.

News December 26, 2025

BHELలో అప్రెంటిస్ పోస్టులు

image

భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్(<>BHEL)<<>> హరిద్వార్ 50 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. B,Tech, BE, డిప్లొమా అర్హతగల వారు JAN 14 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు ముందుగా NATS పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. విద్యార్హతల్లో మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. గ్రాడ్యుయేట్లకు నెలకు రూ.12,900, టెక్నీషియన్ అప్రెంటిస్‌కు రూ.10,900 చెల్లిస్తారు. వెబ్‌సైట్: hwr.bhel.com