News September 26, 2024

బాలినేనిని పవన్ కూడా రక్షించలేరు: టీడీపీ ఎమ్మెల్యే

image

AP: YCP మాజీ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో చేరినా చర్యలు తప్పవని TDP MLA దామచర్ల జనార్ధన్ హెచ్చరించారు. ఆయనతోపాటు కొడుకు ప్రణీత్‌పై కూడా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ‘ఎన్నికల ముందు నాపైన, TDP శ్రేణులపైనా బాలినేని అక్రమ కేసులు పెట్టించారు. బాలినేనిని.. పవన్ కళ్యాణ్ ఎందుకు పార్టీలో చేర్చుకుంటున్నారు? పవన్ కూడా బాలినేనిని కాపాడలేరు. ఈ విషయంలో ఎంతదూరమైనా వెళ్తాను’ అని మండిపడ్డారు.

Similar News

News November 28, 2025

నాగార్జున సాగర్: శిల్పాలతో బుద్ధుని జీవితం బోధపడేలా..!

image

నాగార్జునసాగర్‌లో నిర్మిస్తోన్న బుద్ధచరిత వనం ప్రత్యేక ఆకర్షణగా మారుతోంది. ఇక్కడి శిల్పాలు బుద్ధుడి సంపూర్ణ జీవన ప్రయాణాన్ని జీవంగాను చూపిస్తున్నాయి. జననం, గౌతముని రాజకుమార జీవితం, బోధి వృక్షం కింద జ్ఞానోదయం, ధర్మచక్ర ప్రవర్తనం, మహాపరినిర్వాణం వంటి ముఖ్య ఘట్టాలు ప్రతీ శిల్పంలో ప్రతిబింబిస్తున్నాయి. సందర్శకులకు ప్రతి శిల్ప సమూహం ఆధ్యాత్మికత, శాంతి, బోధనలను స్పష్టంగా తెలియజేసేలా రూపొందించారు.

News November 28, 2025

22 ఏళ్లకే సర్పంచ్.. ఊరిని మార్చేందుకు యువతి ముందడుగు!

image

డిగ్రీ, పీజీ పూర్తయ్యాక పట్టణాలకు వలసెళ్లకుండా ఊరిని బాగుచేయాలి అనుకునే యువతకు 22 ఏళ్ల సాక్షి రావత్ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. సర్పంచ్‌గా మారి గ్రామాన్ని అన్ని విధాలుగా తీర్చిదిద్దాలని భావించిన సాక్షికి ఊరి ప్రజల తోడు లభించింది. ఉత్తరాఖండ్‌లోని కుయ్‌ గ్రామ ఎన్నికల్లో ఆమె సర్పంచ్‌గా గెలిచారు. విద్య, ఆరోగ్యం, గ్రామీణ ఉపాధిపై దృష్టి సారించి.. యువ శక్తితో గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని ఆమె తెలిపారు.

News November 28, 2025

పిన్నెల్లి సోదరులకు సుప్రీంలో ఎదురుదెబ్బ

image

AP: YCP నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. వారి ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ధర్మాసనం కొట్టేసింది. సరెండర్ కావడానికి 2 వారాల గడువు ఇచ్చింది. పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడు జంట హత్య కేసులో వీరిద్దరూ నిందితులుగా ఉన్నారు. ముందస్తు బెయిల్ కోసం వారు గతంలో హైకోర్టును ఆశ్రయించగా చుక్కెదురైంది. దీంతో SCని ఆశ్రయించారు.