News October 19, 2025
MLAనూ వదల్లేదు.. రూ.1.07 కోట్లు దోపిడీ

AP: డిజిటల్ అరెస్టుల పేరుతో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. సామాన్యులనే కాదు నేతలనూ వదలడం లేదు. TDPకి చెందిన ఓ MLA సైతం రూ.1.07 కోట్లు సమర్పించుకున్నారు. ముంబై సైబర్ క్రైమ్ బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నామని, మీపై మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ వారెంట్ వచ్చిందని భయపెట్టారు. దీంతో సదరు MLA డబ్బులు బదిలీ చేశారు. అయినా వదలకపోవడంతో ఆయన HYD క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Similar News
News October 19, 2025
21న ‘మూరత్ ట్రేడింగ్’.. ఈ ఏడాది మారిన టైమింగ్

దీపావళి సందర్భంగా ఈ నెల 21న ప్రత్యేక ‘మూరత్ ట్రేడింగ్’ జరగనుంది. మధ్యాహ్నం 1.45 నుంచి 2.45 గంటల వరకు నిర్వహించనున్నట్లు BSE, NSE ప్రకటించాయి. ప్రతిఏటా సాయంత్రం పూట ఈ సెషన్ జరిగేది. అయితే ఈ సారి సంప్రదాయానికి భిన్నంగా మధ్యాహ్నం నిర్వహించనున్నారు. లక్ష్మీ పూజను పురస్కరించుకొని గంటపాటు జరిగే ఈ ట్రేడింగ్‌లో ఒక్క షేర్ అయినా కొనాలని ఇన్వెస్టర్లు భావిస్తారు. కాగా 21, 22 తేదీల్లో స్టాక్ మార్కెట్లకు సెలవు.
News October 19, 2025
గాజాపై దాడికి హమాస్ ప్లాన్!.. హెచ్చరించిన US

గాజాలోని పౌరులపై దాడి చేయాలని హమాస్ ప్లాన్ చేస్తున్నట్లు అమెరికా హెచ్చరించింది. ఈ విషయంలో తమకు విశ్వసనీయ సమాచారం ఉందని US విదేశాంగ శాఖ తెలిపింది. ఇది కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడమే అవుతుందని చెప్పింది. మీడియేషన్ ద్వారా సాధించిన పురోగతిని దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తంచేసింది. ఒకవేళ హమాస్ దాడి చేస్తే ప్రజలను, సీజ్‌ఫైర్ ఒప్పందాన్ని కాపాడుకోవడానికి చర్యలు తీసుకోవాలని పేర్కొంది.
News October 19, 2025
బౌద్ధుల దీపావళి.. ఎలా ఉంటుందంటే?

దీపావళి బౌద్ధుల పండుగ కానప్పటికీ వజ్రయాన శాఖకు చెందినవారు దీన్ని వేడుకగా జరుపుకొంటారు. నేపాల్‌లోని ‘నేవార్’ ప్రజలు ‘తిహార్’ పేరుతో 5 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తారు. ప్రపంచ స్వేచ్ఛ కోసం ఏ దేవతనైనా ఆరాధించవచ్చనే ఆచారం ప్రకారం వీరు లక్ష్మీదేవిని, విష్ణువును తమ దైవాలుగా భావించి పూజిస్తారు. ఈ పండుగ సందర్భంగా లక్ష్మీదేవిని ప్రార్థించడం ద్వారా సుఖశాంతులు, ఆయురారోగ్యాలు కలుగుతాయని నమ్ముతారు.