News June 12, 2024

భలే దొంగలు.. ఎవరూ గుర్తించలేకపోయారు!

image

టెలిఫోన్ లైన్ కాపర్ కేబుళ్లను దొంగిలించేందుకు కొందరు రోడ్డు, ఫుట్‌పాత్‌ను తవ్వేశారు. మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగులమని చెప్పి ముంబైలోని అంబేడ్కర్ రోడ్డులో 200 మీటర్ల మేర తవ్వేశారు. MTNL అధికారులు వచ్చి చెక్ చేయగా కాపర్ వైరు కనిపించలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు CCTVని చెక్ చేశారు. గత నెలలో ఈ ఘటన జరగ్గా, పోలీసులకు పట్టుబడిన నిందితులకు కోర్ట్ రిమాండ్ విధించింది.

Similar News

News October 6, 2024

ఉజ్వల భవిష్యత్తుకు ప్రపంచ శాంతి అవసరం: మోదీ

image

మాన‌వాళి ఉజ్వ‌ల భ‌విష్య‌త్తు కోసం ప్ర‌పంచ శాంతి అత్య‌వ‌స‌ర‌మ‌ని ప్ర‌ధాని మోదీ పున‌రుద్ఘాటించారు. దేశాల మ‌ధ్య ఐక్య‌త‌, భాగ‌స్వామ్యం ద్వారానే సామూహిక ప్ర‌య‌త్నాల విజ‌యం ఆధారప‌డి ఉంద‌న్నారు. ICJ-ICWకు రాసిన లేఖ‌లో ప్రధాన న్యాయమూర్తులు, మంత్రులు, న్యాయమూర్తులు, పార్లమెంటు సభ్యులు, రచయితలు, సంపాదకులు, న్యాయ విద్యావేత్తల భాగ‌స్వామ్యం ప్రపంచ శాంతికి విధానాల రూప‌క‌ల్ప‌న‌లో కీల‌క‌మ‌ని పేర్కొన్నారు.

News October 6, 2024

WOW.. 65 అడుగుల దుర్గామాత విగ్రహం

image

ఖైరతాబాద్ గణేశ్ విగ్రహం మాదిరిగా ప్రపంచంలోనే అతిపెద్ద దుర్గామాత విగ్రహాన్ని హైదరాబాద్‌లో నెలకొల్పారు. కోఠిలోని సాయిబాబా ఆలయం సమీపంలో ఉన్న విక్టరీ ప్లే గ్రౌండ్‌లో ఏకంగా 65 అడుగుల ఎకో ఫ్రెండ్లీ దుర్గామాత విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అమ్మవారు సింహ వాహనంపై మహాశక్తి అవతారంలో కనిపిస్తున్నారు. ఖైరతాబాద్ గణేశ్ లానే దుర్గామాత విగ్రహాన్ని కూడా ఉన్నచోటే తయారు చేయించారు.

News October 6, 2024

గ్రంథాలయ సంస్థల ఛైర్మన్లు వీరే

image

TGలో పలు జిల్లాల గ్రంథాలయ సంస్థలకు ఛైర్మన్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. గద్వాల – N.శ్రీనివాసులు, MBNR – మల్లు నర్సింహారెడ్డి, వికారాబాద్ – శేరి రాజేశ్‌రెడ్డి, నారాయణపేట్ – వరాల విజయ్, కామారెడ్డి – మద్ది చంద్రకాంత్‌రెడ్డి, సంగారెడ్డి – G.అంజయ్య, వనపర్తి – G.గోవర్ధన్, RR – ఎలుగంటి మధుసూదన్‌రెడ్డి, కరీంనగర్ – సత్తు మల్లయ్య, నిర్మల్ – సయ్యద్ అర్జుమాండ్ అలీ, సిరిసిల్ల – నాగుల సత్యనారాయణ.