News February 14, 2025

CM అయినా.. రేవంత్ బుద్ధి మారలేదు: హరీశ్

image

TG: KCRను తెలంగాణ నుంచి <<15461601>>బహిష్కరించాలన్న <<>>సీఎం రేవంత్ వ్యాఖ్యలపై హరీశ్‌రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘సీఎం పీఠం దక్కినా రేవంత్ బుద్ధి మారలేదు. ఇదే విషయంపై నీ సొంతూరులో ప్రజలను అడుగుదామా? CMగా ప్రజలు నిన్ను గుర్తించడం లేదని ఉనికి చాటుకోవడానికి KCRపై ప్రేలాపనలా? KCRను తిడితే ఒక్క రోజు హెడ్ లైన్స్‌లో ఉంటావేమో. తెలంగాణ చరిత్ర గతిని మార్చిన KCR స్థానం ప్రజల గుండెల్లో పదిలం’ అని Xలో పోస్ట్ చేశారు.

Similar News

News December 10, 2025

పంచాయతీ ఎన్నికలు.. స్కూళ్లకు రేపు సెలవు

image

తెలంగాణలో రేపు తొలి విడత ఎన్నికల పోలింగ్ జరగనుంది. 3,800 గ్రామాల్లో సర్పంచ్, వార్డుల సభ్యులను ఎన్నుకోనున్నారు. దీంతో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిన స్కూళ్లకు విద్యాశాఖ అధికారులు రేపు సెలవు ప్రకటించారు. ఆయా స్కూళ్లకు ఇవాళ కూడా హాలిడే ఉంది. తర్వాత జరిగే 2 విడతల పోలింగ్ నేపథ్యంలో ఈ నెల 13,14(ఆదివారం),16,17న కూడా స్కూళ్లకు సెలవులు ఉండనున్నాయి.

News December 10, 2025

తాజా సినీ ముచ్చట్లు

image

* యాంటీ ఏజింగ్ రీసెర్చ్ చేసేవాళ్లు కొన్నిరోజులు అక్కినేని నాగార్జున గారిపై పరిశోధనలు చేయాలి: విజయ్ సేతుపతి
* రోషన్ కనకాల-సందీప్ రాజ్ కాంబోలో వస్తున్న ‘మోగ్లీ’ చిత్రానికి ‘A’ సర్టిఫికెట్
* రాబోయే ఐదేళ్లలో దక్షిణాదిన రూ.12 వేల కోట్లతో కంటెంట్‌ని సృష్టించబోతున్నట్లు ప్రకటించిన జియో హాట్ స్టార్
* ‘అన్నగారు వస్తారు’ నాకో ఛాలెంజింగ్ చిత్రం: హీరో కార్తి

News December 10, 2025

చిన్నారులకు విటమిన్ డి ఎందుకు అవసరమంటే?

image

పిల్లల ఎముకలు,కండరాల ఆరోగ్యం విషయంలో విటమిన్ D పాత్ర చాలా ముఖ్యమైనది. రోగనిరోధక వ్యవస్థ పనితీరుతో పాటు మొత్తం శరీర ఆరోగ్యంలో D విటమిన్ కీలకపాత్ర పోషిస్తుంది. విటమిన్ D లోపం కారణంగా అనేక రకాల సమస్యలు తలెత్తుతాయి. కీళ్ల నొప్పులు, నిరంతరం అలసట, జుట్టు పల్చబడటం, గాయాలు నెమ్మదిగా మానడం మొదలైనవి విటమిన్ D లోపానికి సంకేతాలు. ఈ లక్షణాలు పిల్లల ఆరోగ్యంపై తీవ్రంగా ప్రభావం చూపిస్తాయి.