News April 9, 2025
RBI వడ్డీ తగ్గించినా బ్యాంకులు తగ్గించట్లేదు

దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించట్లేదన్న చందాన బ్యాంకుల తీరు తయారైంది. వడ్డీ రేట్లను ఆర్బీఐ తగ్గించినా చాలా బ్యాంకులు తగ్గించడం లేదు. దీంతో లోన్లు, EMIలు కట్టేవారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రెపో రేటు తగ్గినా సామాన్యులకు వర్తింపజేయాలా? వద్దా? అనేది బ్యాంకులపై ఆధారపడి ఉండటమే వడ్డీ తగ్గకపోవడానికి కారణం. ఆదాయం పెంచుకోవడంలో భాగంగా బ్యాంకులు ఇలా చేస్తుంటాయి. మీకూ ఇలా ఎప్పుడైనా జరిగిందా?
Similar News
News April 18, 2025
నేటి ముఖ్యాంశాలు

* TG: జపాన్ పర్యటనలో సీఎం రేవంత్ కీలక ఒప్పందం!
* కాంగ్రెస్‌ను చూసి బీజేపీ భయపడుతోంది: భట్టి
* ప్రజలే ప్రభుత్వాన్ని కూలగొడతారు: KTR
* AP: డీఎస్సీకి వయోపరిమితి పెంచుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం
* పాస్టర్ల గౌరవ వేతనానికి రూ.30 కోట్ల నిధుల విడుదల
* హామీలపై ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు: బొత్స
* IPL: SRHపై ముంబై విజయం
News April 18, 2025
సూపర్‌హిట్ మూవీ సీక్వెల్‌లో తమన్నాకు ఛాన్స్!

బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘నో ఎంట్రీ’ సీక్వెల్‌లో హీరోయిన్ తమన్నా భాటియా ఛాన్స్ కొట్టేసినట్లు సినీ వర్గాలు తెలిపాయి. బోనీ కపూర్ నిర్మిస్తున్న ఈ మూవీలో యంగ్ హీరోలు అర్జున్ కపూర్, వరుణ్ ధవన్, దిల్జీత్ దోసాంజ్ లీడ్ రోల్స్‌లో నటించనున్నారు. త్వరలో షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. కాగా 2005లో రిలీజైన ‘నో ఎంట్రీ’లో సల్మాన్ ఖాన్, అనిల్ కపూర్, బిపాసా బసు నటించారు.
News April 18, 2025
JEE మెయిన్ ‘కీ’ తొలగించిన NTA

JEE మెయిన్ ఫలితాల విడుదల వేళ విద్యార్థులను NTA అయోమయానికి గురి చేస్తోంది. ఇవాళ సాయంత్రం అధికారిక వెబ్‌సైట్‌లో ఫైనల్ కీ విడుదల చేసి, కొద్దిసేపటికి దాన్ని తొలగించింది. దీంతో ఫలితాల కోసం ఎదురుచూస్తున్న స్టూడెంట్స్, పేరెంట్స్ ఆందోళనకు గురవుతున్నారు. కాగా ఇవాళ రిజల్ట్స్ వెల్లడించనున్నట్లు ప్రకటించగా, ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోవడంపై NTAపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.