News August 6, 2024
జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్నా జగన్‌కు అభద్రతే: లోకేశ్

AP: జడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉన్నా మాజీ సీఎం జగన్‌కు అభద్రతాభావం పోలేదని మంత్రి నారా లోకేశ్ ఎక్స్‌లో ఎద్దేవా చేశారు. ‘ప్రస్తుతం జగన్‌కు 58 మంది సెక్యూరిటీ, 10 మంది సాయుధ గార్డులు, రెండు ఎస్కార్ట్ టీమ్స్, రెండు ల్యాండ్ క్రూయిజర్, బుల్లెట్ ప్రూఫ్ కారు ఉంది. ఇంకా 986 మందితో భద్రత ఎందుకు అడుగుతున్నారు?’ అని లోకేశ్ ప్రశ్నించారు.
Similar News
News December 11, 2025
ఆలుమగల కలహం, ఆరికకూడు వంట

భార్యాభర్తల మధ్య తలెత్తే చిన్నపాటి గొడవలు, అరికల (కొర్రలు) అన్నం వండడానికి పట్టేంత తక్కువ సమయంలోనే సద్దుమణుగుతాయని ఈ సామెత చెబుతుంది. భార్యభర్తల మధ్య కలహాలు దీర్ఘకాలం ఉండవు. అవి తాత్కాలికమైనవి. త్వరగా సమసిపోతాయి. ఆ కలహాలు వారి మధ్య అనురాగాన్ని మరింత పెంచుతాయి. అలాగే కొర్రల అన్నం కూడా తక్కువ సమయంలోనే సిద్ధమై ఆరోగ్యానికి మేలు చేస్తుందని ఈ సామెత అర్థం.
News December 11, 2025
పాసులుంటేనే ఎంట్రీ!

TG: ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీ, CM రేవంత్ రెడ్డి జట్ల మధ్య ఈ నెల 13న ఫ్రెండ్లీ ఎగ్జిబిషన్ ఫుట్‌బాల్ మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే. పాసులు ఉన్నవారే మ్యాచ్ జరిగే ఉప్పల్ స్టేడియానికి రావాలని రాచకొండ CP సుధీర్ బాబు తెలిపారు. మిగతావారిని ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించబోమన్నారు. ఆరోజు స్టేడియం వద్ద రద్దీ లేకుండా ప్రజలు సహకరించాలని కోరారు. మెస్సీ 13, 14, 15 తేదీల్లో భారత్‌లో పర్యటించనున్నారు.
News December 11, 2025
నేడు క్యాబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలకు ఛాన్స్

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గం ఇవాళ సమావేశం కానుంది. రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు, పారిశ్రామిక రంగం, అమరావతికి నాబార్డు రుణం, పలు అభివృద్ధి పనులపై చర్చించనుంది. గవర్నర్ నివాసంగా కొత్తగా లోక్‌భవన్ నిర్మాణానికి టెండర్లు, జుడీషియల్ అకాడమీకి పరిపాలన అనుమతులు ఇవ్వనుంది. అలాగే పలు సంక్షేమ కార్యక్రమాలపైనా చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంది.


