News February 24, 2025

‘స్పెషల్ కోచ్’ వచ్చినా.. పాక్ కథ మారలేదు!

image

భారత్‌పై గెలవడానికి స్పెషల్ కోచ్‌ను నియమించుకున్నా పాక్ కథ మారలేదు. రెగ్యులర్ కోచ్‌ అకిబ్ జావెద్‌ను కాదని మాజీ ఆటగాడు ముదస్సర్ నాజర్‌ను నియమించుకొని ఆ జట్టు వ్యూహాలు రచించింది. సాధారణంగా పేస్ దళంతో బలంగా కనిపించే పాక్ నిన్నటి మ్యాచ్‌లో బంతితోనూ ఎలాంటి మ్యాజిక్ చేయలేకపోయింది. స్పెషల్ కోచ్ ఇచ్చిన సూచనలు వర్కౌట్ కాలేదో? లేక హై ఓల్టేజ్ కావడంతో ఒత్తిడి తట్టుకోలేకపోయిందో? తెలియదు కానీ ఘోరంగా ఓడింది.

Similar News

News February 24, 2025

నేడు KRMB ప్రత్యేక భేటీ

image

ఇవాళ కృష్ణానది యాజమాన్య బోర్డు(KRMB) ప్రత్యేక సమావేశం కానుంది. మధ్యాహ్నం మూడున్నర గంటలకు తెలుగు రాష్ట్రాల నీటి వాటాలు, ఇతర అంశాలపై అధికారులు KRMB ఛైర్మన్ అతుల్ జైన్‌తో చర్చించనున్నారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ నుంచి ఏపీ అక్రమంగా జలాలను తరలిస్తోందని తెలంగాణ నేతలు వాదిస్తున్నారు. ఈ నెల 21నే సమావేశం జరగాల్సి ఉండగా ఏపీ విజ్ఞప్తితో నేటికి వాయిదా పడింది.

News February 24, 2025

పరీక్ష లేకుండానే ఉద్యోగాలు

image

దేశవ్యాప్తంగా 21,413 గ్రామీణ డాక్ సేవక్ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఏపీలో 1,215, TGలో 519 ఖాళీలు ఉన్నాయి. ఎలాంటి రాతపరీక్ష లేకుండా టెన్త్ మార్కుల మెరిట్ లిస్ట్ ఆధారంగా భర్తీ చేయనున్నారు. బీపీఎం శాలరీ నెలకు రూ.12,000-రూ.29,380, డాక్ సేవక్ జీతం రూ.10,000-రూ.24,470 వరకు ఉంటుంది. దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 3.
వెబ్ సైట్: indiapostgdsonline.gov.in

News February 24, 2025

కివీస్ గెలిస్తే పాకిస్థాన్ ఔట్!

image

ఛాంపియన్స్ ట్రోఫీ గ్రూప్-ఎలో న్యూజిలాండ్, బంగ్లాదేశ్ మధ్య ఇవాళ కీలక మ్యాచ్ జరగనుంది. కివీస్ ఇప్పటికే ఒక మ్యాచ్ గెలవగా, బంగ్లా ఒకటి ఓడిపోయింది. న్యూజిలాండ్ ఈ గేమ్ గెలిస్తే సెమీస్ బెర్తులు తేలిపోనున్నాయి. ఆ జట్టుతో పాటు ఇండియా చెరో 4 పాయింట్లతో సెమీస్ చేరుకుంటాయి. పాకిస్థాన్, బంగ్లా ఇంటిదారి పడతాయి. కివీస్ ఓడితే ఆ రెండు జట్లు సెమీస్ రేసులో నిలుస్తాయి.

error: Content is protected !!