News July 16, 2024
రేషన్ కార్డు లేకున్నా ఆరోగ్యశ్రీ: CM రేవంత్

TG: రాష్ట్రంలో అందరికీ ఆరోగ్యశ్రీ కార్డులు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. దీనికి రేషన్ కార్డుతో లింకు పెట్టొద్దని సూచించారు. ప్రతి ఒక్కరి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ రూపొందించాలని సచివాలయంలో కలెక్టర్లతో సమావేశంలో అన్నారు. రూరల్ వైద్యులను ప్రోత్సహించేలా ఎక్కువ పారితోషికం ఇవ్వాలని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రతి బెడ్‌కు సీరియల్ నంబర్ ఉండేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
Similar News
News November 15, 2025
30 ఓట్లతో గెలిచాడు

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ(BSP) ఒకే ఒక్క సీటు గెలిచింది. రామ్‌గఢ్ నుంచి పోటీ చేసిన సతీశ్ కుమార్ సింగ్ యాదవ్ కేవలం 30 ఓట్లతో గట్టెక్కారు. ఆయనకు 72,689 ఓట్లు రాగా సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి అశోక్ కుమార్ సింగ్‌కు 72,659 ఓట్లు పడ్డాయి. చివరి వరకూ ఇద్దరి మధ్య దోబూచులాడిన విజయం అంతిమంగా సతీశ్‌నే వరించింది. ఇక బిహార్‌లో ఎన్డీఏ 202 సీట్లు గెలుచుకున్న విషయం తెలిసిందే.
News November 15, 2025
రాష్ట్ర ప్రభుత్వ నిధులతో 12 గోదాముల ఏర్పాటు

TG: రాష్ట్ర ప్రభుత్వం రూ.155.68 కోట్ల నిధులతో 12 గోదాములను నిర్మించనుంది. వీటి సామర్థ్యం 1.51 లక్షల టన్నులు. కరీంనగర్ జిల్లా లాపపల్లి, నుస్తులాపూర్, ఉల్లంపల్లిలో, NLG జిల్లా దేవరకొండ, VKB జిల్లా దుద్యాల, హనుమకొండ జిల్లా వంగర, ములుగు జిల్లా తాడ్వాయి, మెదక్ జిల్లా అక్కన్నపేట, పెద్దపల్లి జిల్లా రాఘవాపూర్, ఖమ్మం జిల్లా అల్లిపురం, ఎర్రబోయినపల్లి, మంచిర్యాల జిల్లా మోదెలలో వీటిని నిర్మించనున్నారు.
News November 15, 2025
నాబార్డు నిధులతో 14 గోదాములు ఏర్పాటు

TG: మరో 14 గోదాములను రూ.140 కోట్ల నాబార్డు నిధులతో నిర్మించనున్నారు. వీటి సామర్థ్యం 1.40టన్నులు. నాగర్‌కర్నూల్ జిల్లా పులిజాల, KMR జిల్లా జుక్కల్, మహ్మద్‌నగర్, మాల్తుమ్మెద, KMM జిల్లా కమలాపూర్, వెంకటాయపాలెం, MDK జిల్లా ఝరాసంగం, SRD జిల్లా బాచుపల్లి, MHBD జిల్లా తోడేళ్లగూడెం, కొత్తగూడ, జగిత్యాల జిల్లా చెప్యాల, మల్యాల, జనగామ జిల్లా రామచంద్రగూడెం, పెద్దపల్లి జిల్లా ధరియాపూర్‌లో వీటిని నిర్మిస్తారు.


