News July 10, 2025

చెట్లు లేకున్నా.. రసాయనాలతో ‘కల్తీ’ కల్లు!

image

TG: కూకట్‌పల్లిలో <<17003853>>కల్తీ కల్లు<<>> ఘటన కలకలం రేపుతోంది. హైదరాబాద్‌తో పాటు పరిసరాల్లో తాటి, ఈత చెట్లు తక్కువే ఉన్నా ఒక్క HYDలోనే 100కు పైగా కల్లు కాంపౌండ్లు ఉన్నాయి. డిమాండ్‌కు తగ్గట్లుగా సరఫరా కోసం ప్రమాదకర రసాయనాలతో కల్లు కల్తీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో అధికారుల నిర్లక్ష్యం ఉందని సమాచారం. ఈ కల్లు నాడీ వ్యవస్థపై, కీలక అవయవాలపై ప్రభావం చూపి ప్రాణాలు పోయే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.

Similar News

News July 10, 2025

గాల్లో ఢీకొన్న విమానాలు.. ఇద్దరి మృతి

image

కెనడాలో విమానాలు ఢీకొన్న ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. రెండు శిక్షణ విమానాలు గాల్లో ఢీకొనగా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో భారత సంతతికి చెందిన శ్రీహరి సుకేశ్ (21)తో పాటు మరో వ్యక్తి మృతి చెందారు. సుకేశ్ కేరళ వాసిగా తెలుస్తోంది. ఈ ప్రమాదంపై కాన్సులేట్ జనరల్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. సుకేశ్ ఫ్యామిలీకి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ట్వీట్ చేసింది.

News July 10, 2025

అనుమతి లేకుండా ఇతరుల ఫొటోలు షేర్ చేస్తున్నారా?

image

బెంగళూరులో అనుమతి లేకుండా యువతి వీడియోను తీసి SMలో షేర్ చేసిన 26 ఏళ్ల యువకుడు అరెస్టయ్యాడు. యువతి ఫొటోలు, వీడియోలు అసభ్య కామెంట్లతో వైరలవ్వగా ఆమె పోలీసులను ఆశ్రయించింది. దీంతో యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా ఐటీ యాక్ట్ 2000 సెక్షన్ 66E ప్రకారం ఇతరుల ఫొటోలను SMలో వారి అనుమతి లేకుండా షేర్ చేయడం నేరం. దీని ప్రకారం గరిష్ఠంగా మూడేళ్ల జైలు శిక్ష, రూ.2 లక్షల వరకు జరిమానా విధిస్తారు.

News July 10, 2025

రైతులు మీకు దొంగలు, రౌడీలుగా కనిపిస్తున్నారా?: జగన్

image

AP: మామిడి రైతులు సీఎం చంద్రబాబు, ఆయన అనుకూల మీడియా కళ్లకు దొంగలు, రౌడీల్లాగా కనిపిస్తున్నారా? అని మాజీ CM జగన్ మండిపడ్డారు. రైతులకు అండగా నిలవకపోగా వారిపై వెకిలి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘బాబు పాలకుడు అని చెప్పుకోవడానికి సిగ్గు ఉండాలి. 76 వేల రైతు కుటుంబాల సమస్యను గాలికొదిలేశారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకుని రైతులకు అండగా నిలబడండి’ అంటూ ఆయన ఎక్స్‌లో ట్వీట్ చేశారు.