News September 21, 2024
లడ్డూపై సాయంత్రం ఈవో నివేదిక

AP: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై ఈవో శ్యామలారావు ఇవాళ సాయంత్రం ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. దాని ప్రకారం ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసినట్లు రిపోర్ట్ రావడంతో సమగ్ర నివేదిక ఇవ్వాలని సీఎం చంద్రబాబు టీటీడీ ఈవోను ఆదేశించారు. ఇప్పటికే ఆలయ శుద్ధి, సంప్రోక్షణ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Similar News
News December 1, 2025
పాలమూరు జిల్లాకు కేసీఆర్ ఏం చేయలేదు: సీఎం రేవంత్

TG: పాలమూరు నుంచి ఎంపీగా చేసిన మాజీ సీఎం KCR ఈ జిల్లాకు ఏం చేయలేదని CM రేవంత్ అన్నారు. తమ ప్రభుత్వం వచ్చాకే కొడంగల్, నారాయణపేట ప్రాజెక్టులను ప్రారంభించామని మక్తల్ సభలో పేర్కొన్నారు. ‘రైతులు నష్టపోవద్దని ఎకరాకు ₹20L పరిహారం ఇస్తున్నాం. రెండేళ్లలో ప్రాజెక్టులను పూర్తి చేస్తాం. చదువు లేకపోవడం వల్లే మన ప్రాంతం వెనుకబడింది. అందుకే IIIT మంజూరు చేశాం. ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు నిర్మిస్తున్నాం’ అని తెలిపారు.
News December 1, 2025
హనుమాన్ చాలీసా భావం – 26

సంకటసే హనుమాన ఛుడావై |
మన క్రమ వచన ధ్యాన జో లావై ||
మనసు, మాట, కర్మ.. ఈ త్రికరణ శుద్ధితో హనుమంతుడిపై భక్తి ఉంచితే ఆయన మనల్ని భయాల నుంచి కాపాడతాడు. కష్టాల నుంచి విముక్తులను చేస్తాడు. మన ఆలోచనలో, ఆచరణలో, మాటలో భక్తి భావం ఉన్నవారికి ఆంజనేయుడి అనుగ్రహం తప్పక లభిస్తుంది. అలా లభించినవారు కష్టాలను దాటి, జీవితంలో అపార విజయాన్ని అందుకుంటారు. <<-se>>#HANMANCHALISA<<>>
News December 1, 2025
అరటి సాగు – ఈ జాగ్రత్తలు తీసుకోండి

అరటి మొక్కలను నాటిన 6-8 నెలల్లో చెట్టు మొదలుకు మట్టిని ఎగదోస్తే చెట్టుకు బలం పెరుగుతుంది. గాలులు ఎక్కువగా ఉండే ప్రాంతాలలో వెదురు గడలు పాతి అరటి చెట్టుకు ఊతం ఇవ్వాలి. గెలలు నరికిన చెట్లను అడుగువరకు నరికేయాలి. గెల వేసి హస్తాలు పూర్తిగా విచ్చుకున్న తర్వాత మగ పువ్వును కోసేయాలి. మగ పువ్వును కోసిన వెంటనే పాలిథీన్ సంచులను గెలలకు తొడిగితే పండ్లు పూర్తిగా ఏ విధమైన మచ్చలు లేకుండా ఆకర్షణీయంగా తయారవుతాయి.


