News October 24, 2024

ఈవినింగ్ టైం బీటెక్.. గుడ్‌న్యూస్ చెప్పిన JNTUH

image

TG: పాలిటెక్నిక్ డిప్లమా పూర్తి చేసి ప్రభుత్వ, ప్రైవేట్ పరిశ్రమల్లో పని చేస్తున్న వారికి JNTUH గుడ్ న్యూస్ చెప్పింది. సాయంత్రం వేళ బీటెక్ చదువుకోవాలి అనుకునే వారికి JNTUHతో పాటు మరో 8 కాలేజీలకు అనుమతిచ్చింది. త్వరలో స్పాట్ ప్రవేశాలకు నోటిఫికేషన్ ఇవ్వనుంది. కోర్సు కాలపరిమితి మూడేళ్లు కాగా ఒక్కో విభాగంలో 30 సీట్లు ఉంటాయి. పని చేస్తున్న సంస్థ కాలేజీకి 75km పరిధిలో ఉండాలి. ఏడాది పని అనుభవం తప్పనిసరి.

Similar News

News December 4, 2025

పుతిన్ పర్యటనతో భారత్‌కు లాభమేంటి?

image

* ఆపరేషన్ సిందూర్ సమయంలో పాక్ మిస్సైళ్లు, డ్రోన్లను కూల్చడానికి S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్‌ బాగా ఉపయోగపడ్డాయి. పుతిన్ పర్యటనలో మరిన్ని S-400లతో పాటు S-500 కొనుగోలుకు ఆమోదం లభించనుంది.
* రఫేల్, F-21, F/A-18, యూరో ఫైటర్ టైఫూన్లకు పోటీనిచ్చే Su-57 ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్ జెట్స్ కొనుగోలుపైనా చర్చలు జరుగుతాయి. ఇవి రఫేల్ కంటే తక్కువ ధరకే లభించడం విశేషం.

News December 4, 2025

పుతిన్ పర్యటనతో భారత్‌కు లాభమేంటి?

image

* రెసిప్రోకల్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ లాజిస్టిక్ సపోర్ట్(RELOS): ఈ ఒప్పందం ద్వారా భారత్‌కు సైనిక సహకారం, యుద్ధ నౌకలు, విమానాలకు లాజిస్టిక్ సపోర్ట్ దొరుకుతుంది. గగనతలాలను వాడుకోవడం సులభతరమవుతుంది.
* రష్యా న్యూక్లియర్ పవర్డ్ సబ్‌మెరైన్‌ను భారత్‌కు లీజుకు ఇవ్వనుంది. ఈ డీల్ విలువ $2 బిలియన్లు. దీనిద్వారా ఇండియా సముద్ర సరిహద్దులు మరింత బలోపేతమవుతాయి.

News December 4, 2025

మళ్లీ తగ్గిన బంగారం ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో గంటల వ్యవధిలోనే <<18465069>>మరోసారి<<>> బంగారం ధరలు తగ్గి కొనుగోలుదారులకు ఊరటనిచ్చాయి. 24 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు ఇవాళ రూ.920 తగ్గి రూ.1,29,660కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.850 పతనమై రూ.1,18,850 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.2,00,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.