News December 1, 2024
హోటల్స్‌లో ఇది ఎప్పుడైనా గమనించారా?

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చాలా హోటల్స్‌ను 13వ సంఖ్య భయపెడుతుందనే విషయం మీకు తెలుసా? ఈ నంబర్‌ను దురదృష్టానికి పర్యాయపదంగా పరిగణిస్తుంటారు. అందుకే హోటల్లో 13 నంబర్‌తో రూమ్స్ ఉండవు. అంతేకాదు 12వ అంతస్తు వరకే ఆపేందుకు మొగ్గుచూపుతుంటారు. ఈ మూఢ ఆచారాన్ని ట్రిస్కైడెకాఫోబియా అంటారు. ఇది పాశ్చాత్య సంస్కృతి నుంచి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని మీరెప్పుడైనా గమనించారా?
Similar News
News March 14, 2026
ఒక్కరోజే 2,37,123 గ్యాస్ సిలిండర్ల పంపిణీ

TG: డొమెస్టిక్ సిలిండర్ల డెలివరీకి సమస్య రాకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో శుక్రవారం ఒక్కరోజే అత్యధికంగా 2,37,123 గ్యాస్ సిలిండర్లు పంపిణీ అయ్యాయి. సాధారణంగా జరిగే రోజువారీ సగటు పంపిణీ కంటే ఇది 12K సిలిండర్లు అధికం కావడం విశేషం. IOCL 83,166, HPCL 88,257, BPCL 65,700 గ్యాస్ సిలిండర్లను సరఫరా చేశాయి. GOVT కఠిన చర్యల ఫలితంగా బ్లాక్ మార్కెటింగ్‌కు అడ్డుకట్టపడింది.
News March 14, 2026
ఇన్‌స్టాలో అవి చూసి మోసపోకండి!

ఇన్‌స్టాలో ఏదైనా వస్తువు కనిపించగానే అరే.. బాగుందే అనుకుంటాం. రేట్ కూడా తక్కువే ఉంది కదా కొందామని చూస్తే COD ఉండదు. వెంటనే ఆన్‌లైన్ పేమెంట్ చేసి బుక్ చేస్తాం. కానీ ఎన్నిరోజులైనా అది మీకు డెలివరీ అవ్వదు. ఎందుకంటే అది ఫేక్ షాపింగ్ వెబ్‌సైట్. ఇలాంటి సైట్లు కుప్పలుగా పుట్టుకొచ్చాయి. ముఖ్యంగా మహిళలు వీటి బారిన పడి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. టెంప్ట్ అవ్వకుండా ట్రస్టెడ్ సైట్లలోనే షాపింగ్ చేయండి.
News March 14, 2026
NDAతో పొత్తు ఉండదు: విజయ్

TNలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో NDAతో పొత్తు ఉండదని TVK చీఫ్ విజయ్ స్పష్టం చేశారు. వారితో కలిసి పోటీ చేసే అవకాశమే లేదని తేల్చి చెప్పారు. పొత్తుపై జరుగుతున్న ప్రచారాలన్నీ ఊహాగానాలే అని ఆ పార్టీ జనరల్ సెక్రటరీ నిర్మల్ కుమార్ ప్రకటించారు. ఈ విషయాన్ని గతంలోనే చెప్పామని గుర్తు చేశారు. BJP తమకు సైద్ధాంతిక శత్రువు అన్నారు. పార్టీ అధికారిక ప్రకటన ఇస్తేనే ఇలాంటి వాటిని నమ్మాలని కార్యకర్తలకు సూచించారు.


