News May 22, 2024
‘ఎవరెస్ట్ మ్యాన్’ తగ్గేదేలే..!
సాహసోపేతమైన ఎవరెస్ట్‌ను సునాయాసంగా అధిరోహిస్తున్న ‘ఎవరెస్ట్ మ్యాన్’ కామీ రితా మరో సరికొత్త రికార్డ్ నెలకొల్పారు. ఈనెల 12న ఎవరెస్ట్ ఎక్కిన ఈయన తాజాగా ఈరోజు ఉదయం 7.49 గం.కు మరోసారి ఎవరెస్ట్ చేరుకున్నారు. దీంతో 30సార్లు ఎవరెస్ట్ అధిరోహించిన వ్యక్తిగా నిలిచారు. నేపాల్‌లోని థామేకు చెందిన కామీ (54) సీనియర్ గైడ్‌గా సేవలు అందిస్తున్నారు. కే2, చో ఓయు, లోట్సే, మనాస్లు వంటి పర్వతాలను సైతం ఈయన అధిరోహించారు.
Similar News
News December 25, 2024
వచ్చే నెల 10 నుంచి వైకుంఠ ద్వార దర్శనాలు: TTD
తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాల్ని వచ్చే నెల 10 నుంచి ప్రారంభించనున్నట్లు టీటీడీ ఈవో శ్యామల రావు తెలిపారు. వచ్చే నెల 8న ఉదయం 6 గంటల నుంచి టోకెన్లు జారీ చేయనున్నట్లు వెల్లడించారు. తిరుమల, తిరుపతిలో 9 కేంద్రాల్లో 91 కౌంటర్లు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఇక గోవింద మాల భక్తులకు ప్రత్యేకంగా టికెట్లను ఇవ్వడం లేదని ఆయన స్పష్టం చేశారు.
News December 25, 2024
జానీ మాస్టర్‌కు మరో షాక్
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసులో హైదరాబాద్ నార్సింగ్ పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేశారు. లేడీ కొరియోగ్రాఫర్‌పై లైంగిక దాడులకు పాల్పడ్డట్లు అందులో పేర్కొన్నారు. ఈవెంట్ల పేరుతో ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లి ఆమెను వేధించినట్లు నిర్ధారించారు. కాగా జానీ మాస్టర్ ప్రస్తుతం బెయిల్‌పై విడుదలై బయట ఉన్నారు.
News December 25, 2024
తెలంగాణ ప్రభుత్వానికి రాహుల్ అభినందనలు
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అభినందిస్తూ ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ లేఖ రాశారు. ‘మనం ఇచ్చిన గ్యారంటీలను నెరవేరుస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి శుభాకాంక్షలు. రవాణా, బీసీ సంక్షేమ శాఖలో చేపడుతున్న చర్యలు అభినందనీయం’ అని పొన్నం ప్రభాకర్ పేరిట ఆయన లెటర్ రాశారు. ప్రజలందరికీ న్యాయం జరిగేలా ఇలానే ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు.