News April 24, 2025
సింధు నదిలో ప్రతి నీటి చుక్కా మాదే: పాకిస్థాన్

పహల్‌గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాక్‌తో సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపేయడంపై దాయాది దేశం స్పందించింది. సింధు నీటిలో ప్రతి నీటి చుక్కా తమ హక్కు అని తెలిపింది. ఒప్పందం నుంచి వైదొలగడం చట్ట వ్యతిరేకమని చెప్పింది. ఈ నిర్ణయాన్ని న్యాయ, రాజకీయపరంగా బలంగా ఎదుర్కొంటామని వివరించింది. ప్రపంచ బ్యాంక్ వంటి సంస్థలు కుదిర్చిన ఒప్పందం నుంచి భారత్ ఏకపక్షంగా వైదొలగలేదని ఆ దేశ మంత్రి అవాయిస్ లెఘారీ పేర్కొన్నారు.
Similar News
News April 24, 2025
ఈ ‘హీరో’యిన్‌ను మెచ్చుకోవాల్సిందే..

ఉగ్రదాడిపై స్పందించేందుకు సెలబ్రిటీలు తటపటాయిస్తుంటే తెలుగు హీరోయిన్ అనన్య నాగళ్ల చేసిన పనికి ఆమెపై ప్రశంసలు వెల్లువెత్తాయి. ఉగ్రదాడిలో మరణించిన మధుసూదన్ (నెల్లూరు) భౌతికకాయానికి నివాళులు అర్పించిన ఆమె, కుటుంబసభ్యులకు సానుభూతి తెలియజేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్రం చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా గతేడాది విజయవాడ, ఖమ్మం వరదల సమయంలోనూ తన వంతు బాధ్యతగా రూ.5 లక్షల విరాళం ప్రకటించారు.
News April 24, 2025
పహల్గామ్ బాధితులకు ఫ్రీ ట్రీట్‌మెంట్: అంబానీ

పహల్గామ్ ఉగ్రదాడిలో గాయపడినవారికి ముంబైలోని సర్ హెచ్ఎన్ ఆస్పత్రిలో ఉచిత చికిత్స అందిస్తామని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ తెలిపారు. ‘ఉగ్రదాడి మానవాళికే మచ్చ. అది ఏ రూపంలో ఉన్నా సహించకూడదు. ప్రాణాలు కోల్పోయినవారికి నా ప్రగాఢ సంతాపం. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. దేశం తరఫున అంబానీ కుటుంబం ఎప్పుడూ నిల్చునే ఉంటుంది’ అంటూ ఆయన పేర్కొన్నారు.
News April 24, 2025
‘హిట్-3’ సినిమా నిడివి ఎంతంటే?

నాని, శైలేష్ కొలను కాంబినేషన్లో తెరకెక్కిన ‘హిట్-3’ మూవీకి సెన్సార్ బోర్డు A సర్టిఫికెట్ ఇచ్చింది. మొత్తం సినిమా నిడివి 2.37:06 గంటలుగా ఉంది. సినిమాలో బూతు పదాల వాడుకను పరిమితం చేసింది. హింస ఎక్కువగా ఉన్న సీన్లలో మార్పులు సూచించింది. ఈ మూవీ మే 1న థియేటర్లలో రిలీజ్ కానుంది. కాగా A సర్టిఫికెట్ మూవీస్‌కి 18+ వయసున్న అభిమానులనే థియేటర్లకు అనుమతించాలని సెన్సార్ బోర్డు పేర్కొంటుంది.