News July 27, 2024

ప్రతి భారతీయుడి ఆశయమదే: మోదీ

image

2047 నాటికి భారత్‌ అభివృద్ధి చెందిన దేశంగా అవతరించడమే ప్రతి భారతీయుడి ఆశయమని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఢిల్లీలో జరుగుతున్న నీతి ఆయోగ్ సమావేశం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ప్రజలతో రాష్ట్రాలకు నేరుగా సత్సంబంధాలు ఉంటాయని, వికసిత్ భారత్-2047లో స్టేట్స్ ప్రధాన పాత్ర పోషించాలని ప్రధాని పిలుపునిచ్చారు. మరోవైపు నీతి ఆయోగ్ సమావేశానికి ఏపీ సీఎం చంద్రబాబు హాజరయ్యారు.

Similar News

News February 25, 2025

ఎటు వైపు తిరిగి నిద్రపోతే మంచిది?

image

ఏ వయసు వారైనా నిద్రపోయేటప్పుడు ఎడమవైపు తిరిగి పడుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల మెదడు సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉండదని చెబుతున్నారు. జీర్ణ వ్యవస్థ, గుండె ఆరోగ్యం మెరుగుపడతాయని, ఆయాసం నుంచి ఉపశమనం కలిగి శ్వాస తీసుకోవడం సులభంగా మారుతుందని పేర్కొంటున్నారు. శారీరక నొప్పులు రాకుండా ఉండేందుకు అప్పుడప్పుడు కుడి వైపు, వెల్లకిలా పడుకోవాలని సూచిస్తున్నారు.

News February 24, 2025

బంగ్లాపై న్యూజిలాండ్ ఘన విజయం.. సెమీస్‌కు భారత్

image

ఛాంపియన్స్ ట్రోఫీలో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచులో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. 237 పరుగుల లక్ష్యాన్ని కివీస్ 5 వికెట్లు కోల్పోయి 46.1 ఓవర్లలోనే ఛేదించింది. రచిన్ రవీంద్ర (112) సెంచరీతో విజృంభించారు. 12 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో శతకం చేశారు. ఒక దశలో 72/3తో కష్టాల్లో ఉన్న జట్టును రవీంద్ర ఆదుకున్నారు. కాగా ఈ ఫలితంతో పాక్, బంగ్లా టోర్నీ నుంచి నిష్క్రమించగా, భారత్, కివీస్ సెమీస్‌కు దూసుకెళ్లాయి.

News February 24, 2025

తప్పుడు ఏజెంట్లపై పంజాబ్ సర్కార్ ఉక్కుపాదం

image

భారతీయులను అక్రమంగా విదేశాలకు తరలిస్తున్న 40 మంది ట్రావెల్ ఏజెంట్ల లైసెన్సులను పంజాబ్ సర్కార్ రద్దు చేసింది. 271 మంది ఏజెంట్లకు నోటీసులు జారీ చేసింది. అన్ని ట్రావెల్ కన్సల్టెన్సీ సంస్థల్లో సోదాలు నిర్వహించింది. ప్రయాణికుల రికార్డులు కచ్చితంగా ఉండాలని హెచ్చరించింది. కాగా కొందరు ఏజెంట్లు పలువురు భారతీయులను డంకీ రూట్ ద్వారా US చేర్చారు. ఇటీవల వారిని అమెరికా బంధించి తిరిగి ఇండియాకు పంపింది.

error: Content is protected !!