News January 29, 2025
ప్రతి మనిషికి రోజుకు 100 లీటర్ల నీరు ఇవ్వాల్సిందే: మంత్రి సీతక్క

TG: వేసవి ముగిసే వరకు నీటి ఎద్దడి లేకుండా ప్రతి మనిషికి రోజుకు 100 లీటర్ల నీరు అందించేలా మిషన్ భగీరథ సిబ్బంది కృషి చేయాలని మంత్రి సీతక్క ఆదేశించారు. ఈ పథకానికి వేల కోట్లు ఖర్చు చేసినా ప్రజలెందుకు ఆ నీటిని పూర్తిస్థాయిలో వినియోగించడం లేదో అధ్యయనం చేయాలన్నారు. Feb 1-10 తేదీల మధ్య సమ్మర్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించి మిషన్ భగీరథ నీళ్లు వాడేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.
Similar News
News October 31, 2025
నేడు ఈ జిల్లాలకు వర్ష సూచన

TG: రాష్ట్రంలో మొంథా తుఫాను ప్రభావం దాదాపుగా ముగిసినట్లేనని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. కాకపోతే ఇవాళ మాత్రం కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని HYD వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే ఛాన్సుందని పేర్కొంది.
News October 31, 2025
పాక్-అఫ్గాన్ మధ్య సీజ్ఫైర్

ఇస్తాంబుల్లో ఐదు రోజులుగా పాక్-అఫ్గాన్ మధ్య జరుగుతున్న చర్చల్లో పురోగతి లభించింది. దోహాలో OCT 18-19 మధ్య జరిగిన సీజ్ఫైర్ ఒప్పందాన్ని కొనసాగించేందుకు ఇరు దేశాలు అంగీకరించాయని తుర్కియే ప్రకటించింది. తదుపరి చర్చలు నవంబర్ 6న జరగనున్నాయి. ‘పరస్పర గౌరవం, జోక్యం చేసుకోకపోవడం ఆధారంగా పాక్తో ఎప్పుడూ తాము సత్సంబంధాలే కోరుకుంటాం’ అని అఫ్గానిస్థాన్ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ వ్యాఖ్యానించారు.
News October 31, 2025
పిల్లల సాక్సులు శుభ్రం చేస్తున్నారా?

పిల్లలు బడికి వెళ్లేటప్పుడు షూ, సాక్స్ ధరిస్తుంటారు. కానీ వీటి విషయంలో అశ్రద్ధగా ఉంటే అథ్లెట్స్ ఫుట్ వస్తుందంటున్నారు నిపుణులు. పాదాలకు పట్టిన చెమటను సాక్స్ పీల్చుకుంటాయి. దీంతో బ్యాక్టీరియా, ఫంగస్ ఏర్పడతాయి. వీటిని శుభ్రం చేయకుండా వాడటం వల్ల ఫంగస్ ఇన్ఫెక్షన్స్ వస్తే నిర్మూలించటం కష్టం. నెలల కొద్దీ చికిత్స తీసుకోవాలి. కాబట్టి ఉతికి, పూర్తిగా ఎండిన తర్వాతే సాక్సులను వాడాలని సూచిస్తున్నారు.


