News March 23, 2025
బడి, గుడి ఏదైనా బీఆర్ఎస్ ప్రభుత్వమే కట్టింది: కేటీఆర్

TG: కాంగ్రెస్, బీజేపీ దొందూ దొందేనని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. సీఎం రేవంత్ తెలంగాణలో దోచి ఢిల్లీకి కట్టబెడుతున్నారని ఆరోపించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్‌ని ఏం అడిగినా శివం, శవం అంటూ ముచ్చట చెబుతున్నారని దుయ్యబట్టారు. బడి, గుడి ఏదైనా బీఆర్ఎస్ ప్రభుత్వమే కట్టిందని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావడం చారిత్రక అవసరమని పేర్కొన్నారు.
Similar News
News March 25, 2025
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

కొద్ది రోజులుగా వరుసగా పెరుగుతూ వస్తున్న పసిడి ధరలు ఇవాళ కాస్త తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.300 తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.81,850గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.89,290గా ఉంది. మరోవైపు హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.1,10,000గా ఉంది. ఢిల్లీలో కేజీ వెండి ధర రూ.1,01,000గా ఉంది.
News March 25, 2025
MLAలు పార్టీ మారి వార్షికోత్సవం పూర్తైంది: సుప్రీం

TG: పార్టీ మారిన MLAల అనర్హత పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారించింది. ఈ సందర్భంగా ప్రతివాదులపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘MLAలు పార్టీ మారి ఇప్పటికే వార్షికోత్సవం పూర్తైంది. రీజనబుల్ టైమ్ అంటే వారి పదవీకాలం పూర్తయ్యేవరకా? స్పీకర్ ఏ నిర్ణయం తీసుకోకపోతే పదో షెడ్యూల్‌ను అపహాస్యం చేసినట్లే. ఆలస్యం చేసే ఎత్తుగడలు వేయొద్దు. దీనిపై వారంలోగా వివరణ ఇవ్వాలి’ అని ప్రభుత్వ తరఫు లాయర్‌ను ఆదేశించింది.
News March 25, 2025
NJACపై నిర్ణయం తీసుకోండి: అలహాబాద్ బార్ అసోసియేషన్

NJACపై మళ్లీ నిర్ణయం తీసుకోవాలని అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ కేంద్రాన్ని కోరింది. ఈ మేరకు లేఖ రాసింది. ఢిల్లీ హైకోర్టు జడ్జి యశ్వంత్ వర్మ ఇంట్లో భారీగా నోట్ల కట్టలు కాలిపోవడం తెలిసిందే. కొలీజియం ఆయన్ను అక్కడి నుంచి తమ హైకోర్టుకు బదిలీ చేయడాన్ని బార్ వ్యతిరేకిస్తోంది. నిర్ణయం వెనక్కి తీసుకోకుంటే సమ్మె చేస్తామని హెచ్చరించింది. జడ్జిల నియామకం కోసం GOVT ఏర్పాటు చేయాలనుకున్న కమిషనే NJAC.