News August 13, 2024
ప్రతి విద్యార్థికి ఐడీ కార్డు ఇవ్వాలి: CBN

AP: విద్య ప్రతి ఒక్కరి హక్కు అని బడి ఈడు పిల్లలు బయట ఉండటానికి వీల్లేదని అధికారులకు CM చంద్రబాబు స్పష్టం చేశారు. 100% విద్యార్థుల ఎన్రోల్మెంట్ జరగాలని సూచించారు. ప్రైవేట్ స్కూళ్లలో మాదిరి ప్రభుత్వ పాఠశాలల్లోనూ పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహించాలన్నారు. కేంద్రం తీసుకొచ్చిన APAAR ద్వారా ప్రతి విద్యార్థికి ID కార్డు ఇవ్వాలన్నారు. స్కూళ్లలో ఇంగ్లిష్తో పాటు తెలుగుకు ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు.
Similar News
News December 6, 2025
NTR: వీరికి ఫీజు రీయింబర్స్మెంట్ వర్తించదు

KRU పరిధిలోని కళాశాలలలో పీజీ కోర్సులలో వేకెంట్ సీట్ల భర్తీకై ఈ నెల 8న స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ నిర్వహిస్తున్నామని వర్సిటీ డైరెక్టర్ డా.ఎల్. సుశీల తెలిపారు. ఏపీ పీజీసెట్-2025 రాసి క్వాలిఫై కానివారు, ఆ పరీక్ష రాయనివారు స్పాట్ అడ్మిషన్ ద్వారా అడ్మిషన్ తీసుకోవచ్చని, ప్రభుత్వ నిబంధనల మేరకు వీరికి ఫీజు రీయింబర్స్మెంట్ పథకం వర్తించదన్నారు. DEC 8న ఉదయం 10 గంటలకు KRU క్యాంపస్లో సంప్రదించాలన్నారు.
News December 6, 2025
వంటింటి చిట్కాలు

*వెల్లుల్లిపాయ పొట్టు త్వరగా రావాలంటే.. వాటిని పెనం మీద వేసి కొద్దిసేపు వేడి చేయాలి. ఇలా చేస్తే పొట్టు ఈజీగా వస్తుంది.
*కర్రీలో పులుపు మరీ ఎక్కువగా ఉంటే బెల్లం లేదా ఉప్పు కలిపి చూడండి. ఇక్కడ ఉప్పును రుచి చూసి కలుపుకోవాలి.
* కాకరకాయ కూర వండేటప్పుడు కాస్త నిమ్మరసం వేస్తే చేదు తగ్గుతుంది.
* పకోడీలు కరకరలాడుతూ రావాలంటే పిండి కలిపేటప్పుడే ఒక చెంచా మరుగుతున్న నూనె కలపాలి.
News December 6, 2025
7వేల కి.మీ పొడవైన నది.. కానీ బ్రిడ్జిలు ఉండవు!

ప్రపంచంలోనే అతిపెద్దదైన అమెజాన్ నదిపై వంతెనలు లేవని మీకు తెలుసా? అవును. ఈ నది బ్రెజిల్, పెరూ, ఈక్వెడార్, కొలంబియా, బొలివియా, వెనిజులా, గయానా, సురినామ్ దేశాల మీదుగా దాదాపు 7వేల కి.మీ ప్రవహిస్తుంది. దీని వెడల్పు 3-10 కి.మీ ఉంటుంది. వర్షాకాలంలో అది 48 కి.మీ వరకు విస్తరిస్తుంది. లోతు 330 అడుగులకు చేరుతుంది. అంతేకాదు అక్కడి మృదువైన నేలల్లో బ్రిడ్జిలు నిర్మించడం చాలా కష్టం. అందుకే బోట్లలో నది దాటుతారు.


