News October 15, 2025
ప్రతి విద్యార్థి స్కూల్లో ఉండాలి: భట్టి విక్రమార్క

TG: విద్యారంగం ప్రతిష్టాత్మకమైందని జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో Dy.CM భట్టి విక్రమార్క పేర్కొన్నారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌తో కలిసి బెస్ట్ అవైలబుల్ స్కీమ్ ప్రగతిపై సమీక్షించారు. ‘పథకంలో సమస్యలుంటే యాజమాన్యాలు జిల్లా యంత్రాంగాన్ని సంప్రదించాలి. విద్యార్థులను పంపేయడానికి వీల్లేదు. ఈ పథకం కింద ఎంపికైన ప్రతి విద్యార్థి పాఠశాలలో ఉండేలా అధికారులు చర్యలు చేపట్టాలి’ అని భట్టి ఆదేశించారు.
Similar News
News October 15, 2025
ఆవు పేడతో నెలకు రూ.25వేల ఆదాయం

జీవితంలో ఎదగాలనే తపన ఉంటే ఆవు పేడతోనూ అద్భుతాలు చేయొచ్చని నిరూపిస్తున్నారు మధ్యప్రదేశ్ సాగర్ ప్రాంత మహిళలు. పేడతో కుందులు, బొమ్మలు, ల్యాంప్స్, గోడ గడియారాల లాంటివి తయారు చేసి విక్రయిస్తున్నారు. కొన్ని వస్తువులను విదేశాలకూ ఎగుమతి చేస్తున్నారు. ఇలా ప్రతి నెలా సగటున ₹25K వరకు సంపాదిస్తున్నారు. పండుగ సమయాల్లో ఈ మొత్తం ₹80వేలకు చేరుతోంది.
* రోజూ మహిళల స్ఫూర్తిదాయక కథనాల కోసం <<-se_10014>>వసుధ<<>> క్లిక్ చేయండి.
News October 15, 2025
పంచ భూతాలేనా? ఆరోది కూడా ఉందా?

ఈ అనంత విశ్వం పంచభూతాల కలయికతోనే ఏర్పడింది. ఆరో భూతం లేదు. చైతన్య స్వరూపుడైన పరమాత్మ ఈ 5 శక్తుల ద్వారానే సృష్టిని నడుపుతాడు. భూమి సృష్టికి ఆధారం కాగా, జలం వృద్ధి చేస్తుంది. అగ్ని మార్పును తీసుకురాగా, వాయువు జీవాన్ని ఇస్తుంది, తీసుకుపోతుంది. ఆకాశం సర్వాన్నీ అనుగ్రహిస్తుంది. ప్రజల సుఖ దుఃఖాలు, విశ్వ భవిష్యత్తు ఈ ప్రకృతి శక్తులపైనే ఆధారపడి ఉంటాయనే సత్యాన్ని జ్ఞానులు మాత్రమే గ్రహించగలరు.<<-se>>#SIVOHAM<<>>
News October 15, 2025
ICMRలో ఉద్యోగాలు.. అప్లై చేసుకోండి

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ICMR)15 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు ఈనెల 31వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిగ్రీ, CA/ICWAI/MBA, Mcom, పీజీ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. నవంబర్ 15న రాతపరీక్ష నిర్వహిస్తారు. వెబ్‌సైట్: https://www.icmr.gov.in/