News September 25, 2024
CM అవ్వాలనుకున్న ప్రతిసారి డిప్యూటీ సీఎంకే పరిమితమయ్యా: అజిత్ పవార్

CM అవ్వాలనుకున్న ప్రతిసారి తాను DyCM పదవికే పరిమితం అయ్యానని NCP నేత అజిత్ పవార్ అన్నారు. NCPని చీల్చి మాహాయుతి కూటమితో జట్టుకట్టి ఆయన ఐదోసారి DyCM పదవిలో కొనసాగుతున్నారు. ఓ కాంక్లేవ్‌లో మాట్లాడుతూ ‘నాకు CM కావాలని ఉంది. కానీ నేను ముందుకు సాగలేకపోతున్నాను. నాకు అవకాశం రావడం లేదు’ అని అజిత్ అన్నారు. 2004 ఎన్నికల తరువాత అవకాశం వచ్చినా NCP దాన్ని వృథా చేసుకుందని అన్నారు.
Similar News
News November 27, 2025
11,639 ఉద్యోగాల భర్తీ.. హైకోర్టు కీలక ఉత్తర్వులు

AP: పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న 11,639 ఉద్యోగాల భర్తీపై 6 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు CS, హోంశాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశిస్తూ విచారణను 6 వారాలకు వాయిదా వేసింది. పోలీస్ శాఖలో 19,999 ఖాళీలున్నాయని RTI ద్వారా ప్రభుత్వం సమాధానం ఇచ్చిందని, వీటి భర్తీకి ఆదేశాలివ్వాలంటూ ఓ ట్రస్టు పిల్ వేసింది. వీటిలో 11,639 పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం వివరణ ఇచ్చింది.
News November 27, 2025
ఉత్తరలో విత్తితే, ఊదుకొని తినడానికి లేదు

ఉత్తర నక్షత్రం సాధారణంగా సెప్టెంబరు-అక్టోబరు నెలల్లో వస్తుంది. ఈ సమయంలో వర్షాలు పూర్తిగా తగ్గుముఖం పట్టడం లేదా ఆగిపోతాయి. ఆ సమయంలో విత్తితే పంట పండదు, తినడానికి ఏమీ ఉండదు. అందుకే వ్యవసాయ పనులకు సరైన సమయం ముఖ్యం. వర్షాకాలం పూర్తయ్యాక విత్తనాలు నాటితే నీరు లేక ఎలా పంట ఎండిపోతుందో.. పనులను సరైన సమయంలో, సరైన పద్ధతిలో చేయకపోతే ఫలితం ఉండదని ఈ సామెత భావం.
News November 27, 2025
SCలకు స్కాలర్షిప్.. కొత్త మార్గదర్శకాలివే

SC విద్యార్థులకు టాప్‌క్లాస్ స్కాలర్షిప్ స్కీమ్‌పై కేంద్రం నూతన మార్గదర్శకాలు ఇచ్చింది. ఇకపై పూర్తి ట్యూషన్ ఫీజు, ఇతర రుసుములను నేరుగా వారి అకౌంట్లోకే బదిలీ చేయనుంది. ఏడాదికి గరిష్ఠంగా ₹2Lతోపాటు హాస్టల్, బుక్స్, ల్యాప్‌టాప్‌ల కోసం తొలి ఏడాది ₹80K, ఆ తర్వాత ₹41K చొప్పున అందజేయనుంది. మార్కుల ఆధారంగా పథకాన్ని రెన్యువల్ చేస్తారు. IIT, IIM, NIT, NID, IHM వంటి సంస్థల్లో ప్రవేశం పొందిన వారు అర్హులు.


