News August 7, 2024
అందరూ బౌలింగ్ చేస్తున్నారు సరే.. మరి బ్యాటింగ్?

కోచ్‌గా గంభీర్ హయాంలో భారత జట్టులో కొన్ని మార్పులు వచ్చాయి. ఆల్‌రౌండర్లతోనే కాక రోహిత్, గిల్, సూర్య, రింకూ వంటి బ్యాటర్లతోనూ బౌలింగ్ వేయిస్తున్నారు. ఇది బాగానే ఉంది. కానీ బలమైన బ్యాటింగ్‌కు మారుపేరైన భారత్ శ్రీలంకతో తొలి రెండు వన్డేల్లో 231, 241 రన్స్ ఛేదించలేక ఓడింది. రోహిత్ మినహా ఎవరూ రాణించట్లేదు. అందుకే బౌలర్లూ మినిమం బ్యాటింగ్ చేసేలా చూస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మీరేమంటారు?
Similar News
News March 4, 2026
రాజ్యసభ అభ్యర్థులుగా సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి

తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థులు ఖరారయ్యారు. అభిషేక్ సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి పేర్లను కాంగ్రెస్ హైకమాండ్ ఫిక్స్ చేసింది. వీరు రేపు నామినేషన్ వేయనున్నారు. ప్రస్తుతం వేం నరేందర్ రెడ్డి సీఎం రేవంత్ సలహాదారుగా ఉన్నారు.
News March 4, 2026
DMKతో పొత్తు ఖరారు.. 28 సీట్లలో కాంగ్రెస్ పోటీ

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో DMK-కాంగ్రెస్ మధ్య సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చింది. పలుమార్లు చర్చలు, చిదంబరం-స్టాలిన్ భేటీ అనంతరం రెండు పార్టీలు ఏకాభిప్రాయానికి వచ్చాయి. కాంగ్రెస్‌కు 28 స్థానాలు కేటాయించేందుకు DMK అంగీకరించింది. అలాగే ఓ రాజ్యసభ సీటును ఇవ్వనుంది. 234 సీట్లున్న TN అసెంబ్లీకి వచ్చే ఏప్రిల్-మే నెలల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.
News March 4, 2026
గ్యాస్ ఉత్పత్తిని నిలిపేస్తున్నాం: ఖతర్

లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్(LNG), అనుబంధ ప్రొడక్టుల ఉత్పత్తిని <<19269644>>నిలిపేస్తున్నట్లు<<>> ఖతర్ ప్రకటించింది. ‘గ్యాస్‌ను లిక్విడ్‌గా మార్చే ప్రక్రియను ఆపేస్తున్నాం. నెల రోజులు సూపర్ చిల్డ్ గ్యాస్ ఉత్పత్తి, ఎగుమతి చేయలేం’ అని చెప్పినట్లు రాయిటర్స్ తెలిపింది. గ్లోబల్ LNG ఎగుమతుల్లో ఖతర్ వాటా 20%. తాజా నిర్ణయంతో ఇండియా, జపాన్, చైనా, యూరప్‌పై తీవ్ర ప్రభావం పడనుంది. యూరప్, ఆసియాలో గ్యాస్ ధరలు ఇప్పటికే పెరిగాయి.


