News January 31, 2025
అందరూ ఈ అమ్మాయి గురించే వెతుకుతున్నారు

గౌతమ్ అదానీ కుమారుడు జీత్ అదానీ, దివా షా పెళ్లి FEB 7న జరగనుంది. దీంతో అపర కుబేరుడికి కాబోయే కోడలి బ్యాగ్రౌండ్ ఏంటని నెటిజన్లు గూగుల్లో వెతుకుతున్నారు. ప్రముఖ వజ్రాల వ్యాపారి, ‘సి.దినేశ్ అండ్ కో’ సహ యజమాని జైమిన్ షా కూతురే దివా. హయ్యర్ ఎడ్యుకేషన్ పూర్తి చేసిన ఆమె లోప్రొఫైల్ మెయింటేన్ చేస్తారు. సోషల్ మీడియాకూ దూరంగా ఉంటారు. ఫైనాన్స్, వ్యాపార రంగాల్లో దివా ప్రతిభే అదానీ కుటుంబాన్ని ఆకర్షించిందట.
Similar News
News March 12, 2025
సొంత నిధులతో అన్నదాన సత్రం పునర్నిర్మిస్తా: మంత్రి లోకేశ్

AP: కడప జిల్లాలోని కాశీనాయన అన్నదాన సత్రం కూల్చివేతపై మంత్రి లోకేశ్ స్పందించారు. ‘అటవీ భూములు, టైగర్ జోన్ నిబంధనల కారణంగా కూల్చివేయడం బాధాకరం. నిబంధనలు ఉన్నా భక్తుల మనోభావాలు గౌరవించి కూల్చకుండా ఉండాల్సింది. దీనిపై ప్రభుత్వం తరఫున నేను క్షమాపణ చెబుతున్నాను. కూల్చివేసిన అధికారులపై చర్యలు తీసుకుంటాం. త్వరలో నా సొంత నిధులతో అదే చోట అన్నదాన సత్రం పునర్నిర్మిస్తాను’ అని ట్వీట్ చేశారు.
News March 12, 2025
పోసాని విడుదలకు బ్రేక్!

AP: వైసీపీ మద్దతుదారు పోసాని కృష్ణమురళి విడుదలకు బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. ఆయన కోసం గుంటూరు సీఐడీ పోలీసులు కర్నూలు జిల్లా జైలు వద్దకు వెళ్లి పీటీ వారెంట్ వేశారు. దీంతో ఆయన్ను వర్చువల్గా జడ్జి ముందు ప్రవేశపెట్టనున్నారు. కాగా, పోసానిపై నమోదైన కేసుల్లో బెయిల్ రాగా నేడు విడుదల అవుతారని వార్తలొచ్చాయి. తాజాగా సీఐడీ పీటీ వారెంట్ దాఖలుతో విడుదల నిలిచిపోనున్నట్లు సమాచారం.
News March 12, 2025
పాకిస్థాన్ క్రికెట్ ICUలో ఉంది: అఫ్రీది

సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్లే పాకిస్థాన్ క్రికెట్ ఇప్పుడు ICUలో ఉందని మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రీది అన్నారు. ‘PCB నిర్ణయాల్లో కంటిన్యుటీ, కన్సిస్టెన్సీ ఉండట్లేదు. తరచుగా కెప్టెన్, కోచ్లను మారుస్తున్నారు. కోచ్లు ప్లేయర్లను నిందించడం, మేనేజ్మెంట్ స్టాఫ్ తమ పదవుల్ని కాపాడుకునేందుకు కోచ్లు, ఆటగాళ్లను నిందించడం విచారకరం’ అని బోర్డు పని తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.