News July 7, 2024

నన్ను అంతా అపార్థం చేసుకున్నారు: ఇషాన్

image

BCCI కాంట్రాక్టు కోల్పోవడంపై భారత యువ క్రికెటర్ ఇషాన్ కిషన్ తొలిసారి స్పందించారు. ‘నేను పరుగులు చేస్తున్నా బెంచ్‌లో కూర్చోబెట్టారు. నేనెంతో అలసిపోయాను. అందుకే కాస్త విరామం తీసుకోవాలనుకున్నా. అయితే నా నిర్ణయాన్ని నా ఫ్యామిలీ, నా ఫ్రెండ్స్ మినహా ఎవరూ అర్థం చేసుకోలేదు’ అని కిషన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. కాగా తాము ఆదేశించినా అతడు దేశవాళీ క్రికెట్ ఆడలేదన్న కారణంతో BCCI ఇషాన్‌పై వేటు వేసింది.

Similar News

News March 13, 2026

వారిద్దరూ పార్టీని చీల్చారు: దేవ్‌జీ

image

మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు మృతి వెనక పెద్ద కుట్ర ఉందని ఇటీవల లొంగిపోయిన ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి దేవ్‌జీ అన్నారు. ఆపరేషన్ కగార్ ప్రారంభం కాగానే నంబాల బాడీగార్డులు లొంగిపోయి ఇన్‌ఫార్మర్లుగా మారారని ఆరోపించారు. కీలక నేతలైన మల్లోజుల, ఆశన్న శత్రువులకు లొంగిపోయి ఆయుధాలు అప్పగించారని పేర్కొన్నారు. వీరిద్దరూ పార్టీని చీల్చారని ఆరోపించారు. తాము మాత్రం ఆయుధాలను అడవుల్లోనే వదిలేశామని చెప్పారు.

News March 13, 2026

ఇరాన్ లొంగిపోయేందుకు సిద్ధమైంది: ట్రంప్

image

తాము చేస్తున్న దాడులకు భయపడిపోయి ఇరాన్ లొంగిపోయేందుకు సిద్ధమైందని US అధ్యక్షుడు ట్రంప్ సంచలన కామెంట్స్ చేశారు. 2 రోజుల కిందట G-7 దేశాల నేతలతో జరిగిన వర్చువల్ చర్చల్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని Axios వెల్లడించింది. యుద్ధం కొనసాగించాలా వద్దా అనేది నిర్ణయించేందుకూ ఇరాన్‌లో అధికారులెవరు బతికి లేరని ట్రంప్ చెప్పారు. ‘లీడర్ అంటూ ఎవరూ లేరు. అందుకే లొంగిపోవడం గురించి ఎవరూ ప్రకటించలేదు’ అని పేర్కొన్నారు.

News March 13, 2026

టెన్త్ పరీక్షలు.. విద్యార్థులు ఇలా ప్లాన్ చేసుకోండి!

image

TG: టెన్త్ విద్యార్థుల బోర్డు పరీక్షలకు సమయం ఆసన్నమైంది. రేపటి నుంచి జరిగే పరీక్షల కోసం మొదటగా హాల్ టికెట్, పెన్నులు సిద్ధం చేసుకోండి. పరీక్షా కేంద్రానికి గంట ముందే చేరుకోండి. ప్రశ్నపత్రాన్ని పూర్తిగా చదివి ప్రతి ప్రశ్నకు ఎంత సమయం కేటాయించాలో ముందే ప్లాన్ చేసుకోండి. మీకు బాగా వచ్చిన సమాధానాలను ముందుగా రాయండి. చివరి 10 నిమిషాల్లో రాసిన జవాబులన్నింటినీ ఓసారి సరిచూసుకోండి. ALL THE BEST