News January 2, 2025

అంద‌రూ సిగ్గుప‌డాలి.. మద్రాస్ హైకోర్టు ఆగ్రహం

image

లింగం, కులాల ఆధారంగా వివక్ష కొనసాగుతున్న సమాజంలో జీవిస్తున్నందుకు అంద‌రం సిగ్గుపడాలని మద్రాస్ HC జడ్జి జస్టిస్ వెల్మురుగన్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. చెన్నైలోని అన్నా వ‌ర్సిటీలో విద్యార్థినిపై లైంగిక దాడి ఘ‌ట‌న‌పై నిర‌స‌నకు అనుమ‌తివ్వాలని PMK పార్టీ కోర్టుకెక్కింది. రాజ‌కీయ పార్టీల నిర‌స‌న‌లు మీడియా దృష్టిని ఆక‌ర్షించ‌డానికే త‌ప్పా స‌దుద్దేశాల‌తో కాద‌ని ఘాటుగా స్పందిస్తూ పిటిషన్‌ను కొట్టేసింది.

Similar News

News January 5, 2025

అందుకే భూమి లేనివారికీ రూ.12వేలు: CM

image

TG: సాగు చేసేవారితో పాటు భూమి లేని వ్యవసాయ కుటుంబాలకూ రైతు భరోసా ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. భూమి లేకపోవడం ఒక శాపమైతే, ప్రభుత్వం కూడా తమను ఆదుకోవడం లేదని పాదయాత్ర సమయంలో తన దృష్టికి వచ్చిందని సీఎం చెప్పారు. వారు కూడా సమాజంలో భాగమేనని గుర్తించి, ఏటా రూ.12వేలు ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు.

News January 5, 2025

ఇలాంటి వారు చపాతీలు తినకూడదా?

image

చపాతీలు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కానీ వీటిని కొందరు తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలసట, ఆయాసంతో బాధపడేవారు తినకూడదు. వీటిలో ఉండే కార్బోహైడ్రేట్లను బర్న్ చేయడం వీరికి కష్టం. డయాబెటిస్ రోగులు కూడా వీటిని తీసుకోకపోవడం ఉత్తమం. అమిలో పెక్టిన్ అనే స్టార్చ్ మూలాలు రక్తంలో షుగర్ లెవెల్స్ పెంచుతాయి. అధిక బరువు, ఊబకాయం, థైరాయిడ్, జీర్ణ సమస్యలు ఉన్నవారు వీటికి దూరంగా ఉండాలి.

News January 5, 2025

మారుతి 40 ఏళ్ల రికార్డును బద్దలుకొట్టిన టాటా

image

గత ఏడాది ఇండియాలో అత్యధికంగా అమ్ముడుపోయిన కార్ మోడల్‌గా టాటా పంచ్ నిలిచింది. 2024లో 2.02 లక్షల పంచ్ మోడల్ కార్లు అమ్ముడయ్యాయి. ఆ తర్వాత మారుతి వ్యాగన్ R, ఎర్టిగా, బ్రెజా, హ్యుండాయ్ క్రెటా ఉన్నాయి. కాగా 1985-2004 వరకు మారుతి 800, 2005-2017 వరకు మారుతి ఆల్టో, 2018లో డిజైర్, 19లో ఆల్టో, 2020లో స్విఫ్ట్, 2021-22లో వ్యాగన్ R, 2023లో స్విఫ్ట్ ఎక్కువగా అమ్ముడైన కార్లుగా ఉన్నాయి.