News November 25, 2024

సర్వే అధికారులకు ప్రతి ఒక్కరూ సహకరించాలి: మంత్రి పొన్నం

image

TG: బీసీలకు న్యాయం జరగాలనే లక్ష్యంతో ప్రభుత్వం కులగణన కార్యక్రమం చేపట్టిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఉప్పల్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సర్వే అధికారులకు ప్రతి ఒక్కరూ పూర్తి వివరాలు తెలిపి వారికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ డేటా సంక్షేమ పథకాల లబ్ధి, బీసీల అభివృద్ధికి చొరవ చూపిస్తుందన్నారు. ఒకవేళ ఎన్యుమరేటర్లు రాకపోతే పిలిపించుకొని సర్వే నిర్వహించుకోవాలని సూచించారు.

Similar News

News November 25, 2024

లెబనాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు: 29 మంది మృతి

image

లెబనాన్‌పై ఇజ్రాయెల్ మళ్లీ విరుచుకుపడింది. బీరూట్‌లోని ఓ బిల్డింగుపై వరుసగా ఎయిర్ స్ట్రైక్స్ చేపట్టింది. భీకరమైన ఈ దాడుల్లో 29 మంది మరణించారు. హెజ్బొల్లాకు చెందిన ఇంటెలిజెన్స్ యూనిట్, మిసైల్ యూనిట్, ఆయుధాలను స్మగ్లింగ్ చేసే 4400 యూనిట్ సహా 12 కమాండ్ సెంటర్లను నాశనం చేశామని IDF ప్రకటించింది. తమ దేశంపై టెర్రరిస్టు దాడుల ప్లానింగ్, కమాండ్, అమలుకు వీటిని వాడేవాళ్లని తెలిపింది.

News November 25, 2024

ఈరోజు ఉ.10 గంటలకు..

image

AP: తిరుమల శ్రీవారి దర్శన, గదుల టికెట్లను నేడు విడుదల కానున్నాయి. ఫిబ్రవరి నెలకు సంబంధించిన రూ.300 స్పెషల్ ఎంట్రీ టికెట్లను ఉ.10 గంటలకు ఆన్‌లైన్‌లో ఉంచుతారు. అలాగే ఫిబ్రవరి కోటా గదుల టికెట్లను ఈరోజు మ.3 గంటలకు విడుదల చేయనున్నారు. ఆర్జిత సేవలు, దర్శనం, వసతి కోటా టికెట్లను https://ttdevasthanams.ap.gov.in సైట్ నుంచి మాత్రమే కొనుగోలు చేయాలని టీటీడీ సూచించింది.

News November 25, 2024

మాజీ MLA రామచంద్రారెడ్డి కన్నుమూత

image

TG: సిద్దిపేట జిల్లాకు చెందిన మాజీ MLA డి. రామచంద్రారెడ్డి(85) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈయన HYDలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి చనిపోయారు. మాజీ సీఎం కేసీఆర్ సమకాలికులైన ఈయన 1985లో దొమ్మాట నియోజకవర్గం(ప్రస్తుతం దుబ్బాక) నుంచి TDP ఎమ్మెల్యేగా గెలుపొందారు. రామచంద్రారెడ్డికి ఇద్దరు కుమార్తెలు ఉండగా, వారి వద్దే ఉంటున్నారు. స్వస్థలం సిద్దిపేట జిల్లా కొండపాక.