News February 4, 2025
ప్రతి ఒక్కరూ ఇవి తెలుసుకోండి!
ఆరోగ్యకరమైన వ్యక్తి BP-120/80 ఉంటుంది. పల్స్ (70-100), టెంపరేచర్ (36.4°C-37.2°C), బ్రీతింగ్ (12-16p/m), హిమోగ్లోబిన్ (పురుషులు 13-18, మహిళలు 11.50-16g/dL), కొలస్ట్రాల్(130-200), పొటాషియం(3.50-5), సోడియం(135-145mEq/L), రక్తం (5-6L), షుగర్ (పిల్లల్లో 70-130, పెద్దల్లో 70-115mg/dL), ఐరన్ (8-15mg), తెల్ల రక్త కణాలు(4000-11000), ప్లేట్లెట్స్ (1.5L- 4L), విటమిన్ D3(20-50ng/ml), Vit-B12 (200-900pg/ml).
Similar News
News February 4, 2025
సెన్సెక్స్ 1100 జంప్: రూ.6లక్షల కోట్ల లాభం
స్టాక్మార్కెట్లు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. నిఫ్టీ 23,666 (+320), సెన్సెక్స్ 78,250 (+1110) వద్ద ట్రేడవుతున్నాయి. కొన్ని దేశాలపై టారిఫ్స్ను ట్రంప్ వాయిదా వేయడం, డాలర్ ఇండెక్స్ తగ్గడం, ఆసియా స్టాక్స్ పుంజుకోవడం, బ్యాంకు, ఫైనాన్స్, O&G షేర్లలో ర్యాలీయే ఇందుకు కారణాలు. దీంతో ఇన్వెస్టర్లు ఈ ఒక్కరోజే రూ.6లక్షల కోట్ల సంపదను పోగేశారు. శ్రీరామ్ ఫైనాన్స్, LT, ADANI SEZ, BEL, TATAMO టాప్ గెయినర్స్.
News February 4, 2025
కులగణనతో చరిత్ర సృష్టించాం: సీఎం రేవంత్
TG: కులగణన, ఎస్సీ వర్గీకరణకు తెలంగాణ నుంచే రోడ్ మ్యాప్ ఇస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. దేశంలోనే తొలిసారి కులగణన చేసి చరిత్ర సృష్టించామని ప్రకటించారు. కులగణన నివేదికను క్యాబినెట్లో ఆమోదించిన ఈరోజు దేశ చరిత్రలో నిలిచిపోయే రోజుగా అభివర్ణించారు. పకడ్బందీగా సర్వే చేసి సమాచారం సేకరించామని తెలిపారు. కులగణన విషయంలో తమ నిర్ణయంతో ప్రధానిపై కూడా ఒత్తిడి పెరుగుతుందని చెప్పారు.
News February 4, 2025
PHOTO: కొత్త లుక్లో సమంత
స్టార్ హీరోయిన్ సమంత కొత్త లుక్లో దర్శనమిచ్చారు. బాయ్ తరహాలో ఉన్న ఆమె లుక్ ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశంగా మారింది. మ్యాగజైన్ కోసం ఆమె పోజులిచ్చినట్లు తెలుస్తోంది. కాగా అనారోగ్యం నుంచి కోలుకున్న తర్వాత ఆమె కాస్త బక్కచిక్కారు. గత కొంత కాలంగా తెలుగు సినిమాలకు దూరమయ్యారు.