News July 31, 2024
బీఆర్ఎస్ ఆర్థిక కుట్ర ఏంటో అందరికీ తెలియాలి: CM రేవంత్

TG: బీఆర్ఎస్ హయాంలో MMTS సేవల్ని విమానాశ్రయం వరకు విస్తరించేందుకు అనుమతి ఎందుకివ్వలేదో ఆ పార్టీ నేతలు చెప్పాలని సీఎం రేవంత్ అసెంబ్లీలో డిమాండ్ చేశారు. ఆ పార్టీ చేసిన ఆర్థిక కుట్ర అందరికీ తెలియాలని పేర్కొన్నారు. పాతబస్తీని ఇస్తాంబుల్ చేస్తామనో, హుస్సేన్ సాగర్ నీళ్లను కొబ్బరి నీళ్లలా మార్చుతామనో తామెప్పుడూ చెప్పలేదన్నారు. అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలు రచించి అమలు చేస్తున్నామని ఆయన వివరించారు.
Similar News
News March 6, 2026
మైనర్లకు SM బ్యాన్.. దేశవ్యాప్తంగా చేయాల్సిందేనా?

మైనర్లకు SMను బ్యాన్ చేస్తూ కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా పాజిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. APలో కూడా ఈ తరహా విధానంపై కసరత్తు చేస్తున్నట్లు ఇటీవల మంత్రి లోకేశ్ ప్రకటించారు. అయితే తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా 16 ఏళ్లలోపు పిల్లలకు SMను నిషేధించడం అత్యవసరమని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. టీనేజర్లు వీటి బారినపడి అశ్లీలత, సమయం వృథా, చెడు అలవాట్లకు గురవుతున్నారని అంటున్నారు.
News March 6, 2026
గిన్నిస్ రికార్డ్.. ఈయనకు 42 పళ్లు

సాధారణంగా మనిషికి 32 పళ్లు ఉంటాయని చదువుకున్నాం. కొందరికి 34 కూడా ఉండటం చూస్తుంటాం. కానీ మలేషియాకు చెందిన 33 ఏళ్ల ప్రతాప్ మునియాండికి ఏకంగా 42 పళ్లు ఉన్నాయి. ఈయనను అత్యధిక పళ్లున్న వ్యక్తిగా గుర్తించినట్లు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ట్వీట్ చేసింది. ఆయన ఫొటోను షేర్ చేయగా నోరంతా దంతాలే కనిపించాయి. 2021లో తన కుటుంబంతో కలిసి ఉన్నప్పుడు ఈ విషయాన్ని గమనించిన ఆయన డెంటిస్టుల ద్వారా నిర్ధారించుకున్నారు.
News March 6, 2026
కర్ణాటకలో మైనర్లకు సోషల్ మీడియా బ్యాన్

కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 16 ఏళ్లలోపు మైనర్లకు సోషల్ మీడియాను బ్యాన్ చేస్తున్నట్లు సీఎం సిద్దరామయ్య అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రకటించారు. పిల్లలు, టీనేజర్లపై SM దుష్ప్రభావం చూపుతుందనే కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఆస్ట్రేలియాలో మైనర్లకు SMపై నిషేధం ఉండగా ఫిన్‌ల్యాండ్, UK కూడా అమలుకు కసరత్తు చేస్తున్నాయని KA ఐటీ మినిస్టర్ ప్రియాంక్ ఖర్గే వెల్లడించారు.


