News April 6, 2025

అందరూ రామాయణం, భారతం చదవాలి: వెంకయ్య

image

AP: శ్రీరాముడు అసమానతలు లేని ఆదర్శ పాలన చేశారని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చెప్పారు. ఆయనను ఆదర్శంగా తీసుకుని పాలన చేయాలని నాయకులకు సూచించారు. నెల్లూరు(D) చౌటపాళెంలో జరిగిన శ్రీరామనవమి వేడుకల్లో మాట్లాడుతూ ‘ప్రతిఒక్కరూ రామాయణం, మహాభారతం చదవాలి. అలా చేయకపోవడం వల్లే అశాంతి నెలకొంది. చిన్నపిల్లలు కూడా హత్యలు, అత్యాచారాలు, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు’ అని పేర్కొన్నారు.

Similar News

News April 8, 2025

ప్రియాంశ్ దూకుడు.. 19 బంతుల్లోనే ఫిఫ్టీ

image

IPL: చెన్నైతో జరుగుతున్న మ్యాచులో పంజాబ్ యువ బ్యాటర్ ప్రియాంశ్ ఆర్య అదరగొడుతున్నారు. పవర్ ప్లేలోనే మూడు కీలక వికెట్లు కోల్పోయినా దూకుడుగా ఆడుతున్నారు. ఈ క్రమంలో 19 బంతుల్లో 4 సిక్సర్లు, 5 ఫోర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నారు. ప్రస్తుతం పంజాబ్ స్కోర్ 6 ఓవర్లలో 75/3గా ఉంది. ప్రభ్‌సిమ్రాన్ (0), శ్రేయస్ అయ్యర్ (9), స్టాయినిస్ (4) ఔటయ్యారు.

News April 8, 2025

కెనడాలో ఉండేవారికి శుభవార్త.. కనీస వేతనం పెంపు

image

కెనడా ప్రజలకు అక్కడి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రైవేట్ సెక్టార్‌లో కనీస వేతనాలను పెంచింది. ప్రస్తుతం గంటకు కనీస వేతనం 17.30 డాలర్లు ఉండగా దాన్ని 17.75 డాలర్లకు పెంచుతున్నట్లు ప్రకటించింది. కాగా జస్టిన్ ట్రూడో ప్రభుత్వంలో వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఎన్నికల్లో ద్రవ్యోల్బణం అంశమే కీలక అజెండాగా మారింది. కెనడా జనాభాలో 3.7% ఉన్న భారతీయులకు ఈ నిర్ణయంతో ప్రయోజనం కలగనుంది.

News April 8, 2025

రేపు ఎన్టీఆర్-నీల్ సినిమా అప్‌డేట్

image

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న సినిమా నుంచి రేపు కొత్త అప్‌డేట్ రానుంది. రేపు మ.12.06 గంటలకు ప్రకటన ఉంటుందని మేకర్స్ తెలిపారు. మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు రవి బసూర్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి మూవీని రిలీజ్ చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీకి ‘డ్రాగన్’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది.

error: Content is protected !!