News January 18, 2025
సైఫ్పై దాడిలో ఆధారాలు గుర్తింపు: ఫడ్నవీస్
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్పై దాడి ఘటనలో పోలీసులు కొన్ని ఆధారాలను గుర్తించినట్లు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ వెల్లడించారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా నిందితుడి చిత్రాలను స్పష్టంగా కనుగొన్నట్లు పేర్కొన్నారు. దర్యాప్తు కొనసాగుతోందని, అతి త్వరలోనే నిందితుడిని పోలీసులు పట్టుకుంటారని చెప్పారు. కాగా బాలీవుడ్ స్టార్లపై వరుస దాడుల నేపథ్యంలో మహా ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.
Similar News
News January 18, 2025
మరో 63 అన్న క్యాంటీన్లు
AP: రాష్ట్రంలో కొత్తగా 63 అన్న క్యాంటీన్ల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. త్వరలోనే వీటి ఏర్పాటు, నిర్వహణకు టెండర్లు పిలవనున్నారు. ఏ ప్రాంతాల్లో ప్రారంభిస్తారనే విషయమై ఈ నెలఖారులోగా క్లారిటీ వచ్చే అవకాశముంది. కూటమి ప్రభుత్వం గత ఏడాది ఆగస్టు 15న అన్న క్యాంటీన్లను ప్రారంభించగా ప్రస్తుతం 203 అందుబాటులో ఉన్నాయి.
News January 18, 2025
నేడు విజయ్ హజారే ట్రోఫీ ఫైనల్
దేశవాళీ వన్డే ట్రోఫీ విజయ్ హజారే ఫైనల్ నేడు విదర్భ, కర్ణాటక జట్ల మధ్య జరగనుంది. విదర్భ కెప్టెన్ కరుణ్ నాయర్ భీకర ఫామ్లో ఉండగా ఆ జట్టు తొలిసారి టైటిల్ గెలవాలని ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు ఐదో సారి VHTని ఖాతాలో వేసుకోవాలని మయాంక్ సారథ్యంలోని కర్ణాటక చూస్తోంది. మ.1.30కు మ్యాచ్ ప్రారంభం కానుండగా జియో యాప్, స్పోర్ట్ 18 ఛానల్లో లైవ్ చూడవచ్చు.
News January 18, 2025
నేటి నుంచి ఫ్లెమింగో ఫెస్టివల్
AP: నేటి నుంచి రాష్ట్రంలో మూడు రోజుల పాటు ఫ్లెమింగో ఫెస్టివల్ జరగనుంది. మంత్రులు కందుల దుర్గేశ్, అనగాని సత్యప్రసాద్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. 2020 తర్వాత ఈ వేడుకల్ని నిర్వహిస్తున్నారు. తిరుపతి(D) సుళ్లూరుపేటలోని నేలపట్టు, అటకానితిప్ప, బీవీ పాలెం, శ్రీసిటీ ప్రాంతాల్లో ఈ ఫెస్టివల్ జరగనుంది. 3 రోజుల్లో 5-6 లక్షల మంది పర్యాటకులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.