News December 31, 2025

EVMలతో కాదు.. ఓటర్ లిస్టులతోనే అవకతవకలు: TMC

image

ఓటర్ లిస్ట్‌లో అవకతవకలతో ఓట్ చోరీ జరుగుతోందని, EVMల ద్వారా కాదని టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీ సంచలన కామెంట్స్ చేశారు. బెంగాల్‌లో SIR తర్వాత ఎలక్టోరల్ రోల్స్‌పై పార్టీల అనుమానాలను నివృత్తి చేయడంలో ఎలక్షన్ కమిషన్ ఫెయిలైందని ఆరోపించారు. ఓటర్ల సంఖ్యలో తేడాలుంటే ఫైనల్ ఓటర్ లిస్ట్‌ను TMC అంగీకరించదని, లీగల్‌గా పోరాడుతుందన్నారు. 10 మంది పార్టీ లీడర్లు ECని కలిసిన తర్వాత అభిషేక్ ఈ వ్యాఖ్యలు చేశారు.

Similar News

News January 6, 2026

మనుషుల కేసుల్లో కూడా ఇన్ని అప్లికేషన్లు రావు: SC

image

వీధి కుక్కల కేసులో పెద్ద మొత్తంలో మధ్యంతర దరఖాస్తులు రావడంపై సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘సాధారణంగా మనుషుల విషయంలో కూడా ఇన్ని అప్లికేషన్లు రావు’ అని జస్టిస్ మెహతా అన్నారు. ఈ కేసును ముగ్గురు జడ్జిల బెంచ్ రేపు విచారిస్తుందని తెలిపారు. కుక్క కాట్లు పెరుగుతున్న నేపథ్యంలో స్టెరిలైజేషన్, టీకాల తర్వాత షెల్టర్లకు కుక్కలను తరలించాలని గతేడాది నవంబర్‌లో కోర్టు ఆదేశాలిచ్చింది.

News January 6, 2026

వెనిజులా తర్వాత.. ఈ దేశాలే ట్రంప్ టార్గెట్?

image

వెనిజులాపై <<18751661>>దాడి<<>> చేసి ప్రపంచవ్యాప్తంగా ట్రంప్ అలజడి సృష్టించారు. ఇప్పుడు ఆయన గ్రీన్లాండ్, కొలంబియా, ఇరాన్, మెక్సికో, క్యూబాపై దృష్టి పెట్టే అవకాశం ఉంది. ఇరాన్ అణు కార్యక్రమాలపై ఆయన గుర్రుగా ఉన్నారు. <<18742175>>అటాక్‌కు సిద్ధమని<<>> ఇటీవల హెచ్చరించారు. గ్రీన్లాండ్‌లోని ఐస్‌ల్యాండ్‌పై కన్నేశారు. క్యూబా దశాబ్దాలుగా కొరకరాని కొయ్యగా మిగిలింది. కొలంబియా, మెక్సికో డ్రగ్ ముఠాలపై చర్యలు తీసుకుంటామని ట్రంప్ ప్రకటించారు.

News January 6, 2026

VIRAL: ఈ పెద్ద కళ్ల మహిళ ఎవరు?

image

కర్ణాటకలో ఎక్కడ చూసినా ఓ మహిళ ఫొటో కనిపిస్తోంది. నిర్మాణంలో ఉన్న బిల్డింగులు, పొలాలు, దుకాణాలు ఇలా ప్రతి చోట ఆమె చిత్రాన్ని దిష్టి బొమ్మగా పెడుతున్నారు. దీంతో పెద్ద కళ్లతో, సీరియస్‌గా చూస్తున్న ఆ మహిళ ఎవరంటూ నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు. ‘ఆమె పేరు నిహారికా రావు. కర్ణాటకకు చెందిన యూట్యూబర్. 2023లో ఓ వీడియో క్లిప్‌ నుంచి తీసుకున్నదే ఆ లుక్’ అని కొందరు యూజర్లు పేర్కొంటున్నారు.