News July 8, 2025
EVMల భద్రతకు పటిష్ఠ చర్యలు: కలెక్టర్

EVMల భద్రతకు పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేష్ ధోత్రే తెలిపారు. ASFలోని ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల గోదాంను నెలవారి తనిఖీల్లో భాగంగా పరిశీలించారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో నిరంతరంగా గస్తీ నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
Similar News
News July 8, 2025
సమ్మెకు దూరంగా ఉండండి: జీఎం విజయభాస్కర్ రెడ్డి

కార్మికులు ఒకరోజు టోకెన్ సమ్మెలో పాల్గొనకుండా విధులకు హాజరై లక్ష్యసాధనలో భాగస్వాములు కావాలని సింగరేణి బెల్లంపల్లి ఏరియా జీఎం విజయభాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం రెబ్బెన మండలం గోలేటిలో పనిచేస్తున్న కార్మికులతో మాట్లాడారు. పలు రకాల సంక్షేమ పథకాలను అందిస్తున్న మన కంపెనీని కాపాడుకోవడం అందరి బాధ్యత అన్నారు. ఒక రోజు పని గంటలు నష్టపోతే కంపెనీ వెనుకంజ వేయాల్సి వస్తుందని తెలిపారు.
News July 8, 2025
చిత్తూరు: పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహకాలు

చిత్తూరు జిల్లాలో పరిశ్రమల స్థాపనకు ఔత్సాహికులు ముందుకు వస్తే సహకారం అందజేస్తామని కలెక్టర్ సుమిత్ కుమార్ మంగళవారం తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం జిల్లా పరిశ్రమలు, ఎగుమతి ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించారు. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు ముందుకు వస్తే తగిన సహాయ సహకారాలు అందిస్తామని కలెక్టర్ వెల్లడించారు. నిరుద్యోగులకు శిక్షణ అందజేసి ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు.
News July 8, 2025
ముగిసిన పోలీస్ డ్యూటీ మీట్ పోటీలు

కరీంనగర్‌లో రాజన్న జోన్ III స్థాయి తెలంగాణ స్టేట్ పోలీస్ డ్యూటీ మీట్ పోటీలు ముగిసినట్లు CP గౌస్ ఆలం మంగళవారం తెలిపారు.సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్, యాంటీ సబాటేజ్ చెక్, కంప్యూటర్ అవేర్నెస్ కాంపిటీషన్, డాగ్ స్క్వాడ్ కాంపిటీషన్, పోలీస్ ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ వంటి ఆరు విభాగాలలో పోటీలు నిర్వహించారు. విజేతలుగా నిలిచిన వారిని ఎంపిక చేసి వరంగల్‌లో నిర్వహించనున్న పోటీలకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు.