News March 4, 2025

EVM అయినా.. బ్యాలెట్ అయినా గెలుపు కూటమిదే: లోకేశ్ 

image

EVM అయినా.. బ్యాలెట్ అయినా గెలుపు కూటమిదే అని మంత్రి లోకేశ్ అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయం నేపథ్యంలో టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విజయోత్సవ సంబరాల్లో మంత్రి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. 9 నెలల్లో అధికారంలోకి రావడమైనా, 9 నెలల్లో సంక్షేమం, అభివృద్ధి చేసి చూపించినా ఒక్క టీడీపీకే సాధ్యమని అన్నారు. ఈ విజయం ఒక చరిత్ర అని అభివర్ణించారు. 

Similar News

News December 19, 2025

గుంటూరు జిల్లా విద్యాశాఖలో క్రమశిక్షణ చర్యలు

image

గుంటూరు జిల్లాలో హెచ్‌ఎం/స్కూల్ అసిస్టెంట్ల పదోన్నతుల విషయంలో విద్యాశాఖ నిబంధనలను ఉల్లంఘించి అవకతవకలకు పాల్పడినట్లు అభియోగాలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో క్రమశిక్షణ చర్యలలో భాగంగా అప్పటి డీఈఓగా పనిచేసిన గంగాభవానితో పాటు మరో ఏడుగురు అధికారులపై విచారణకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీసెస్ (సీసీఏ) రూల్స్-1991లోని రూల్ నంబర్ 20 ప్రకారం విచారణ నిర్వహించేందుకు ఉత్తర్వులు జారీ చేశారు.

News December 19, 2025

రేపు టీడీపీ కేంద్ర కార్యాలయానికి నారా లోకేశ్

image

మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ శనివారం టీడీపీ కేంద్ర కార్యాలయానికి రానున్నారు. ఈ సందర్భంగా నిర్వహించే ప్రజాదర్బార్‌లో ప్రజల నుంచి వచ్చే అర్జీలను ఆయన స్వీకరించనున్నారు. అలాగే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడితో లోకేశ్ భేటీ కానున్నారు. పార్టీ వ్యవహారాలు, ప్రజా సమస్యలపై చర్చ జరగనున్నట్లు సమాచారం.

News December 19, 2025

గుంటూరులో గంజాయి అక్రమ రవాణా.. ఐదుగురి అరెస్ట్

image

గంజాయి అక్రమ రవాణా, అమ్మకాలకు పాల్పడిన ఐదుగురు నిందితులను అరండల్ పేట పోలీసులు అరెస్ట్ చేసి, 1.20కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. బ్రాడిపేట ప్రాంతంలో నిఘా ఏర్పాటు చేసి, నిందితులను పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసును సమర్థవంతంగా ఛేదించిన CI ఆరోగ్యరాజు, SI క్రిష్ణ బాజీ బాబు, సిబ్బందిని వెస్ట్ DSP అరవింద్ అభినందించారు. చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పదని హెచ్చరించారు.