News May 24, 2024
EVM ధ్వంసం ఘటనలో పలువురు సస్పెండ్.. వివరాలివే..!

రెంటచింతల మండలం పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రంలో ఈవీఎం పగలగొట్టిన విషయంలో అధికారులను సస్పెండ్ చేసినట్లు కలెక్టర్ శ్రీకేశ్ తెలిపారు. GJC జూనియర్ కాలేజ్, సత్తెనపల్లిలో జూనియర్ లెక్చరర్‌గా పనిచేసే PV సుబ్బారావు (ప్రిసైడింగ్ ఆఫీసర్), వెంకటాపురం జిల్లా పరిషత్ హైస్కూల్లో, స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న షేక్ షహనాజ్ బేగం (పోలింగ్ ఆఫీసర్ /అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్)ను విధుల నుంచి తొలగించామన్నారు.
Similar News
News November 21, 2025
గుంటూరులోని ఈ బాలుడు మీకు తెలుసా?

గుంటూరు రైల్వేస్టేషన్ తూర్పు గేటు పార్కింగ్ వద్ద నవంబర్ 18న ఉదయం 8 గంటలకు మూడేళ్ల బాలుడు ఏడుస్తూ ఒంటరిగా దొరికాడు. తల్లిదండ్రుల ఆచూకీ లభించకపోవడంతో ఆర్‌పీఎఫ్, చైల్డ్ వెల్ఫేర్ అధికారులు బాలుడిని కొత్తపేట పోలీసుల ద్వారా శిశు సంరక్షణ కేంద్రానికి తరలించారు. బాలుడు తన వివరాలు చెప్పలేకపోతున్నాడు. బాలుడి ఆచూకీ తెలిసిన వారు తనను 8688831320 నంబర్‌లో సంప్రదించాలని కొత్తపేట సీఐ కోరారు.
News November 21, 2025
గుంటూరు: డిసెంబర్ 13న జాతీయ లోక్ అదాలత్

గుంటూరు జిల్లా వ్యాప్తంగా DEC 13న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నారు. సివిల్, రాజీ పడదగ్గ క్రిమినల్, ఎక్సైజ్, మోటార్ ప్రమాద బీమా, చెక్ బౌన్స్, LAOP, ప్రీ-లిటిగేషన్ కేసులపై ప్రత్యేక బెంచీలు ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయికళ్యాణ్ చక్రవర్తి తెలిపారు. కక్షిదారులు, పోలీసులు, స్టేక్‌హోల్డర్లు ఎక్కువ కేసులు రాజీ చేసుకునేందుకు సహకరించాలన్నారు.